2020లో చంద్రయాన్

Spacecraft
  • మానవరహిత అంతరిక్ష యానం

  • బృందంలో ఓ మహిళ కూడా..

  • ఆస్ట్రోనాట్లకు ‘వ్యోమనాట్లు’గా పేరు

  • ఇస్రో చైర్మన్ కే శివన్ వెల్లడి

బెంగళూరు: త్వరలో గగన్‌యాన్ మిషన్ ప్రారంభం కాబోతోందని ఇస్రో ఛైర్మన్ శివన్ వెల్లడించారు. ఇస్రోకి ఇది పెద్ద మరపురానిదిగా గగన్‌యాన్ నిల వబోతోందని ఆయన అన్నారు. 2020 డిసెంబర్ నాటికి రెండు మానవరహిత అంతరిక్ష కార్యకలాపాలు నిర్వహిం చనున్నట్లు శివన్ తెలిపారు. ఇస్రో తదుపరి ప్రాజెక్టు పీఎస్‌ఎల్‌వీ సీ-44 అని అన్నారు. త్వరలో దేశవ్యాప్తంగా 6 ఇస్రో ఇంక్యుబేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామ ని, మార్చి 25 నుంచి ఏప్రిల్‌లోగా చంద్రయాన్-2 ప్రయోగం చేయనున్నట్లు శివన్ వెల్లడించారు.ఇస్రో సాంకే తిక పరిజ్ఞానంలో మేటి అయిన భారీ రాకెట్ జియోసింక్ర నస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్-3( జీఎస్‌ఎల్‌విఎం కే-3) ద్వారా మిషన్ గగన్‌యాన్ ఆపరేషన్ చేపట్టబోతు న్నారు. భారత్ నుంచి ఇస్రో ప్రయోగిస్తున్న మొట్టమొదటి మానవ సహిత మిషన్ ఇది. దీంతో ఇప్పటికే మానవ సహిత అంతరిక్ష మిషన్స్ నిర్వహించిన అమెరికా, చైనా, రష్యా జాబితాలో ఇండియా చేరబోతోంది. గగన్‌యాన్ సేవలు అందుబాటులోకి వస్తే విద్యాసంస్థలు, పరిశ్రమ లు, జాతీయ సంస్థలు, ఇతర సైంటిఫిక్ సంస్థల మధ్య సమన్వయం సాధ్యపడనుంది. భారత అంతరిక్ష పరిశోధ న సంస్థ ఇస్రో చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచే ప్రాజెక్టు ‘గగన్‌యాన్’. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ద్వారా 2021 డిసెంబరు నాటికి భారత్ వ్యోమగాములను అంతరిక్షం లోకి పంపించాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్లు కె.శివన్ వెల్ల డించారు. గగన్‌యాన్ ద్వారా వ్యోమగాములను అంతరి క్షంలోకి పంపితే.. స్వతంత్రంగా మనుషులను అంతరిక్షం లోకి పంపిన నాలు గో దేశంగా భారత్ ఘనత దక్కించుకో నుంది. గత ఏడా ది స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ గగన్‌యాన్ ప్రాజెక్టుపై ప్రకటన చేశారు. 2022నాటికి వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు ప్రణాళిక వేస్తున్నట్లు చెప్పారు. అయితే ఇప్పుడు శివన్ 2021 డిసెంబరు నాటికే పంపాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ‘గగన్‌యాన్ ప్రాజెక్టు ద్వారా పంపే వ్యోమగాములకు తొలుత భారత్‌లో, తర్వాత రష్యాలో శిక్షణ ఇప్పిస్తాము. బృందంలో మహిళ కూడా ఉంటారు. ఇది మా లక్ష్యం’ అని శివన్ తెలిపారు. గగన్‌యాన్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.10వేల కోట్లు కేటాయించింది. ముగ్గురు వ్యోమగాములను వారం పాటు అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రష్యా, ఫ్రాన్స్‌లతోభారత్ ఒప్పందం కుదుర్చుకుంది. వ్యోమగాముల బృందం పూర్తిగా పురుషులతో కూడుకు న్నది కాదని.. ఆ బృందంలో ఓ మహిళ కూడా ఉంటారని ఆయన తెలిపారు. 

ఈ ఏడాది ఏప్రిల్‌లో చంద్రయాన్-2
ఈ ఏడాది ఏప్రిల్‌లో చంద్రుడిపైకి ‘చంద్రయాన్-2’ను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని శివన్ వెల్లడించారు. ఇస్రో తొలుత ‘చంద్రయాన్-2’ను జనవరి నుంచి ఫిబ్రవరి 16 మధ్యలో చేపడతామని తెలిపింది. అయితే కొన్ని పరీక్షలు పూర్తికాకపోవడం వల్ల తేదీని మార్చారు. మార్చి 25 నుంచి ఏప్రిల్ చివరి నాటికి ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమవుతున్నామని నేడు శివన్ తెలిపారు. పదేళ్ల క్రితం పంపిన చంద్రయాన్-1కు ఇది అడ్వాన్స్‌డ్ వర్షెన్. రూ.800కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టారు.

Tags

సంబంధిత వార్తలు