అడుగడుగునా అన్యాయమే...

Updated By ManamFri, 05/25/2018 - 01:22
image

imageవారంతా పచ్చని అడవుల్లో కొండ కోనల్లో, గోదావరి కౌగిట్లో ప్రకృతిని ఆస్వాదిస్తూ వారి జీవితాలను ఆనందంగా గడుపుతున్న వారు. కాని ఉన్నట్లుండి అదే ప్రకృతి వారి పాలిట శాపంగా మారింది. ప్రకృతి శాపానికి గోదావరి కోపానికి ఆదివాసీలు మృత్యు ఒడిలోకి చేరారు. ఈ విధివైపరీత్యంలో జరిగిన ఘోరంలో మానవ తప్పిదం ఉందని తెలిస్తే మనగుండెల్లో రగిలే బాధకు అవధులుండవు. ఇటీవల తూర్పుగోదా వరి జిల్లాలోని చాపరాయిలో 16 మంది ఆదివాసీలు విషజ్వరాల బారినపడి మృతిచెందిన సంఘటనను మరువక ముందే మరో ఘోర ప్రమాదం ఆదివాసీల గుండెలను పిండేసింది. అదే మంటురూ- వాడ పల్లి లాంచీ ప్రమాదం. ఈ ప్రమాదంలో 16 మంది ఈదుకుంటూ ప్రాణాలు కాపాడుకోగా సుమారు 22 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో వృద్ధులు, స్త్రీలు, పసిపిల్లలు ఉండటం హృదయ విదారకం. ఏళ్ల తరబడి రహదారి సౌకర్యం లేకపోవడంతో గత్యంతరం లేక గోదావరినే రహదారిగా చేసుకొని ప్రయాణం చేయడమే ఆ ప్రాంతం లోని ప్రజలు చేస్తున్న తప్పా? మరి దానికి ప్రత్యామ్నాయం కల్పించా ల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా?. 

ప్రమాదం  జరిగిన తరువాత ప్రభుత్వం చెప్పిన మాటలు చూస్తే తప్పు ప్రయాణికులది, లాంచీ నిర్వహకులది అన్నట్లు ఉంది తప్ప ఈ ప్రమాదానికి ఇటు ప్రభుత్వానికి గానీ, అటు ప్రభుత్వ అధికారులకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్లు ఉంది. గత కొద్దిరోజులుగా గోదావరిపై వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదం జరి గిన తరువాత అధికారులు నిబంధనల ప్రకారమే లాంచీలు బోట్స్ న డపాలని, నిబంధనలు పాటించకుండా ఉంటే కఠిన చర్యలంటూ ప్రక టనలు చేయడం మామూలుగా మారింది. నిబంధనలు సక్రమంగా అమలు చేయడంలో అధికారులకు బాధ్యత లేదా? గోదావరిలో తిరిగే బోట్స్‌ను రెవెన్యూ, పోలీసు, పర్యాటక శాఖ, నీటి పారుదల శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలి. కానీ ఆ పర్యవేక్షణ లేకపో వడం వల్లనే వాడపల్లి ప్రమాదం జరిగింది. సాక్షాత్తు  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అధికారులు పరిశీలించిన తరువాతనే ఆ లాం చీకి అనుమతి ఇచ్చారు అని, సాయంత్రం వీరు (ప్రయాణికులు, లాం చీ నిర్వాహకలు) చేసిన తప్పిదం వల్లనే ప్రమాదం జరిగిందని, అధికారుల తప్పు ఏమీలేనట్లు చెప్పడం విడ్డూరంగా ఉంది. లాంచీ ఫిట్‌నెస్ చూస్తే సరిపోతుందా? లాంచీ సామర్థ్యానికి మించి ప్ర యా ణికులను ఎక్కించకుండా చూడాలని అధికారులకు తెలిసినా పట్టించు కోరూ ఎందుకంటే లాంచీ నిర్వాహకులకు స్థానిక అధికారులకు మధ్య ఉండే సంబంధం అలాంటిది మరి. పెనుగాలులు వీస్తున్నా, వర్షం కురుస్తున్నా అటువంటి ప్రతికూల పరిస్థితులలో కూడా లాంచీ ప్రయా ణిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు, ప్రయాణికులు ఉన్న లాంచీలో 60 సిమెంట్ బస్తాలు ఎలా వేశారు? ఇవన్నీ అధికారులకు తెలీయకుండానే జరిగి ఉంటే మరి అక్కడ అధికారులు డ్యూటీ చేయడం లేదనే కదా అర్థం! అలా కాకుండా  అధికారులు ఆ సమయంలో రేవులో సక్రమంగా విధులు నిర్వహించి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేది కాదు. 

ప్రమాదం జరిగిన తరువాత ప్రభుత్వం చేపట్టిన చర్యలు వారికి వారే సమర్ధించుకోవడం సిగ్గుచేటు. ఏదో సహాయం చేశామంటు ఘ నంగా చెప్పుకున్నారు. అంతగా ఎంచేశారు? ప్రభుత్వం తన బాధ్యత నిర్వర్తించింది అంతేకాని మునిగిపోయిన వారిని ఒక్కరినైనా ప్రాణాల తో  కాపడగలిగారా అంటే అదీ లేదు. ప్రమాదం జరిగిన తరువాత ఎంత టెక్నాలజీని ఉపయోగించినా ప్రయోజనం ఏమిటి? మహ అయితే మృతదేహాలను బయటకు తీస్తారు. అదే టెక్నాలజీని ప్రమా దం జరగకుండా ఎందుకు ఉపయోగించరు? ఆదివాసి ప్రాంతంలో రో డ్లు వెయ్యరు, కమ్యూనికేషన్లు అభివృద్ధి పరచరు? అభివృద్ధిని మావోయిస్టులు అడ్డుకుంటుంన్నారు లేదా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి అని కుంటిసాకులు చూపిస్తారు. కానీ అదివాసిలను వారి ప్రాంతాల నుంచి తరిమికొట్టడమే ప్రభుత్వాల అసలు లక్ష్యం. అందుకే అమా యక అదివాసిలకు డబ్బులు ఆశ చూపించి వారిని పోలవరం ప్రాజె క్టుకు బలిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ పాలకులకు ప్రాజె క్టుల మీద ఉన్న శ్రద్ధ ఆదివాసీల అభివృద్ధిపై కానరాదు. ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న ఖనిజ సంపదను దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ ఆదివా సీల రక్షణ మీద కానరాదు. లాంచీ ప్రమాదం జరిగి ఆదివాసీలు 22 మంది ప్రాణాలు కోల్పోతే గానీ ఆ ప్రాంతంలో రోడ్డు వేయాలని ప్రభుత్వానికి లేదు. మొన్న చాపరాయిలో 16 మంది, నేడు వాడపల్లి లో 22 మంది మరి రేపు? ఇంకా ఎంతమంది ఆదివాసీలు బలవ్వాలి ఈ పాలకులకు కనువిప్పు కావడానికి? 5వ షెడ్యూల్ భూభాగంలో విద్య,  ఉద్యోగ,  రాజకీయ,  వ్యాపార,  ఉపాధి ఫలాలు సంపూర్ణంగా ఆదివాసిలకే దక్కాలి. కానీ ఏజెన్సీ ప్రాంతంలో వ్యాపారులు పూర్తిగా గిరిజనేతరులే. ప్రమాదానికి గురైన లక్ష్మీ పరమేశ్వర లాంచీ కూడా ఓ గిరిజనేతరుడిదే! ఇలాంటి గిరిజనేతరుల లాంచీలు అక్రమ మార్గంలో లైసెన్సులు పొంది కొన్ని, బీనామీల పేరుతో కొన్ని, అసలు లైసెన్సు లేకుండా మరికొన్ని సంవత్సరాల తరబడి పాపికొండల ప్రాంతాల్లో గో దావరిపై వ్యాపారం చేస్తున్నా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసు కున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతి పదికన పాపికొండల ప్రాంతంలో రోడ్లు వేయాలి, ప్రభుత్వ పథకాలు పించన్లు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు అధికారులు గ్రామాల్లోనే ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆదివాసి గూడాల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించాలి. ఏజెన్సీలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న గిరిజనేత రుల లాంచీలను తక్షణమే నిషేధించాలి. లాంచీ ప్రమాదానికి కారణ మైన నిర్వహకులపై, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికా రులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, మృతుల కుటుంబాల కు రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేసియా చెల్లించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ డిమాండ్ చేస్తోంది. లాంచీ ప్రమాదంలో మృతిచెందిన వారి కు టుంబాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎక్స్‌గ్రేసియా చెల్లించాలి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. 
 - కుంజా శ్రీను 
7995036822 

English Title
All Rights Reserved ...
Related News