ఏడేళ్ల తర్వాత భారతి పేరు చార్జిషీట్‌లోనా !?

Updated By ManamFri, 08/10/2018 - 14:23
YSRCP Leader Tammineni Sitaram Respond on Ys Bharathi Name In ED Charge Sheet

YSRCP Leader Tammineni Sitaram Respond on Ys Bharathi Name In ED Charge Sheet

విజయవాడ: వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో మొట్టమొదటిసారిగా ఆయన భార్య భారతిపై కూడా అభియోగాలు నమోదైనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కట్టు కథలన్నీ ఎల్లో మీడియా సృష్టిస్తోందని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మీడియా టీడీపీకి ఏజెంట్‌గా పని చేస్తోందని.. ఈడీ కేసుల విషయం ఎల్లో మీడియాకు ఎలా తెలిసిందని వైసీపీ సీనియర్‌ నాయకులు తమ్మినేని సీతారాం సూటి ప్రశ్న సంధించారు. శుక్రవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్‌ జగన్‌ కుటుంబంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. నాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డిని ఎదుర్కోలేక పోయారని.. నేడు వైఎస్‌ జగన్‌ను ఎదుర్కోలేకపోతున్నారని పేర్కొన్నారు. ఎన్ని ఆరోపణలు చేసినా వైఎస్‌ జగన్‌ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

తమ్మినేని సూటి ప్రశ్నలివీ..
"
ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఏడేళ్ల తర్వాత వైఎస్‌ భారతి పేరును చార్జిషీట్‌లో ఎలా చేర్చింది?. ఏడేళ్ల తర్వాత భారతి పేరును చార్జిషీట్‌లో ఎలా పెడతారు?. భారతీ సిమెంట్స్‌ మెజారిటీ వాటాను ఫ్రాన్స్‌ కంపెనీ వికా కొనుగోలు చేసింది. అసలు చార్జిషీట్‌లో భారతీ పేరును పెట్టిన విషయం ఆమెకు తెలియకముందే.. ఎల్లో మీడియాకు ఎలా లీకైంది? ఉమాశంకర్‌ గౌడ్‌, గాంధీ అనే అధికారులతో టీడీపీకి లీకులు చేస్తున్నారా లేదా?. భారతి సిమెంట్స్‌లో పెట్టుబడులు అంతా సక్రమంగానే జరిగాయి!. ఈ కేసును టీడీపీ అభిష్టానికి అనుగుణంగా బీజేపీ వాడుకుంటోంది. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికినా ఎందుకు చర్యలు తీసుకోలేదు?. ఓటకు కోట్లు కేసులో అన్ని సాక్షాలున్నా కేసు ఎందుకు ముందుకు సాగడం లేదు. బీజేపీ అగ్రనేతలతో బాబుకు ఫెవికాల్‌ బంధం ఉంది. చంద‍్రబాబు శాశ్వత మిత్రుడు అని రాజ్‌నాథ్‌ చెప్పారు.. బీజేపీ-టీడీపీల మధ్య ఉత్తుత్తి బెదిరింపులనే విషయం నిజం కాదా?. ఏపీకి ద్రోహంలో ఇద్దరికీ సహకరించిన ఇంటి దొంగ టీడీపీ..? ఎన్టీఆర్‌ ఆశయాన్ని పాతేసి కాంగ్రెస్‌తో కలుస్తారా? రాష్ట్ర విభజన లేఖ ఇ‍చ్చింది టీడీపీనే" అని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.

English Title
YSRCP Leader Tammineni Sitaram Respond on Ys Bharathi Name In ED Charge Sheet
Related News