చార్జ్‌షీట్‌లో భారతీ పేరుండటంపై జగన్ స్పందన

Updated By ManamFri, 08/10/2018 - 10:48
jagan and bharathi

Jagan Reddy

హైదరాబాద్: వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో మొట్టమొదటిసారిగా ఆయన భార్య భారతిపై కూడా అభియోగాలు నమోదయ్యాయి. జగన్ కంపెనీ అయిన భారతీ సిమెంట్స్‌లో ‘క్విడ్‌ప్రో కో’ పద్ధతిలో జరిగిన పెట్టుబడుల వ్యవహారం కోర్టులో కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సీబీఐ ప్రత్యేక కోర్టులో ఇటీవల అభియోగ పత్రం (చార్జిషీటు) దాఖలు చేసింది. గతంలో ఈ అభియోగ పత్రాల్లో భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అదంతా ఒట్టి పుకార్లేనని కొద్దిరోజుల తర్వాత తేలింది. అయితే తాజాగా ఈడీ అభియోగ పత్రం దాఖలు చేయడంతో జగన్ కుటుంబీకులతో పాటు వైసీపీ పార్టీ శ్రేణులు సైతం ఒకింత అవాక్కయ్యాయి.

ఈ వ్యవహారంపై తాజాగా వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. " నా భార్య పేరు చార్జిషీటులో ఉందని ఓ సెలెక్టెడ్ మీడియాలో వచ్చిన వార్త విని షాకయ్యాను. ఇది చాలా బాధాకరం. కుటుంబాలను ఇలాంటి విషయాల్లోకి లాగడం సబబు కాదు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలను చూసినప్పుడు బాధేస్తుంది" అని ఆయన చెప్పుకొచ్చారు.

 

English Title
 Ys jagan Reacts On Bharathi named in ED chargesheet
Related News