సుబోధ్ కుటుంబానికి యోగి పరామర్శ

Yogi Adityanath meets family of UP cop killed in Bulandshahr violence

లక్నో : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బులంద్‌షెహర్ హింసలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అధికారి సుబోధ్ సుబోధ్ సింగ్ కుటుంబాన్ని  యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురువారం పరామర్శించారు. సుబోధ్ సింగ్ కుటుంబసభ్యులు ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి కార్యాలయంలో యోగితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి అన్నవిధాలా అండగా ఉంటామని యోగీ భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం ఇన్‌స్పెక్టర్ సుబోధ్ కుమారుడు శ్రేయ్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ... తమకు అన్నవిధాల అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చామన్నారు. ఇన్‌స్పెక్టర్ కుటుంబానికి యాభై లక్షల నష్టపరిహారంతో పాటు పిల్లల చదువుకు ప్రభుత్వం సాయం చేస్తుందని బీజేపీ మంత్రి అతుల్ పేర్కొన్నారు. అలాగే ఓ రోడ్డుకు సుబోధ్ సింగ్ పేరు పెడతామని తెలిపారు.

ప్రధాన నిందితుడు అరెస్ట్
ఇక ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడైన భజరంగ్‌దళ్ నాయకుడు యోగేశ్ రాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.  మూడు రోజుల క్రితం బులంద్ షెహర్‌లో గోవధ జరిగిందంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా చెలరేగిన హింసలో ఇన్‌స్పెక్టర్ సుబోధ్ సింగ్‌తో పాటు ఓ నిరసనకారుడు మరణించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు