వీడియో: ఆటోడ్రైవర్‌ను కాల్చేసింది

Updated By ManamThu, 06/21/2018 - 15:40
Woman Shoots Auto Driver Over A Row Following Parking Place
Woman Shoots Auto Driver Over A Row Following Parking Place

గుర్గావ్: ఆగ్రహంతో ఊగిపోయింది. తుపాకీ తీసింది. లోడ్ చేసింది. ఎక్కుపెట్టి కాల్చేసింది. పార్కింగ్ స్థలం విషయంలో వచ్చిన గొడవ మూలంగా ఆటోడ్రైవర్‌ను కాల్చింది ఓ మహిళ. ఈ ఘటన బుధవారం ఉదయం గుర్గావ్‌లో జరిగింది. ఆ తతంగాన్ని అటుగా వెళ్లేవాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో దావానలంలా వ్యాపించింది ఈ ఘటన. సప్న (34) అనే మహిళ ఈ ఘటనకు పాల్పడింది. సునీల్ అనే ఆటో డ్రైవర్ రోడ్డుపక్కన తన ఆటోను ఆపాడని, తీయాల్సిందిగా సప్న చెబితే.. అతడు తియ్యను అనడంతో మాటామాటా పెరిగి గొడవకు దారి తీసిందని పోలీసులు చెబుతున్నారు. ఆ క్రమంలోనే తుపాకీ తీసి సునీల్‌ను సప్న కాల్చిందని చెప్పారు. సప్నను, ఆమె భర్త భూరేను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఆ సమయంలో వారితో ఉన్న మరో వ్యక్తి పారిపోయాడని, అతడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. కాగా, సప్న తుపాకీ తీసి తన నుదుటిపై పెట్టిందని, ఆమె కాల్చే లోగా పక్కకు తప్పుకోవడంతో ప్రాణాలతో మిగిలానని ఆటో డ్రైవర్ సునీల్ చెబుతున్నాడు. ఆమె భర్త కూడా తనపై దాడికి దిగాడని ఆరోపిస్తున్నాడు.

English Title
Woman Shoots Auto Driver Over A Row Following Parking Place
Related News