బంగారు ధరలకు రెక్కలు

Gold

న్యూఢిల్లీ: పెళ్లి సీజన్ కారణంగా దేశీ జువెలర్ల నుంచి డిమాండ్ ఎగయడం వల్ల బంగారం ధరలు పెరిగాయని ట్రేడర్లు పేర్కొన్నారు. అయితే ప్రతికూల అంతర్జాతీయ పరిస్థితుల వల్ల ధరల పెరుగుదల పరిమితంగానే ఉందని తెలిపారు. బంగారం ధరలు వరుసగా మూడో రోజు కూడా పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో బంగారం ధర రూ.110 పెరుగుదలతో రూ.32,800లకు చేరింది. పెళ్లి సీజన్ డిమాండ్ను అందిపుచ్చుకోవడానికి దేశీ జువెలర్ల నుంచి డిమాండ్ ఎగయడం ఇందుకు ప్రధాన కారణం. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పెరిగాయి. కేజీ వెండి ధర రూ.300 పెరుగుదలతో రూ.40,100కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ ఎగయడం ధరల పెరుగుదలకు దోహదపడింది. పెళ్లి సీజన్ కారణంగా దేశీ జువెలర్ల నుంచి డిమాండ్ ఎగయడం వల్ల బంగారం ధరలు పెరిగాయని ట్రేడర్లు పేర్కొన్నారు. అయితే ప్రతికూల అంతర్జాతీయ పరిస్థితుల వల్ల ధరల పెరుగుదల పరిమితంగానే ఉందని తెలిపారు. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్కు 0.38శాతం క్షీణతతో 1,281 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరుగుదలతో రూ.32,800కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.32,650కు పెరిగింది. గత రెండు సెషన్లలో బంగారం ధర రూ.190 మేర ఎగసింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.25,200గా నమోదైంది. వెండి ధర రూ.40,100 కి చేరగా.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.277 పెరుగుదలతో రూ.39,333కి పెరిగింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.77,000 ఉండగా.. అమ్మకం ధర రూ.78,000గా ఉంది. 

Tags

సంబంధిత వార్తలు