కన్నడ నాడి ఏమంటుంది?

Updated By ManamSun, 05/13/2018 - 01:35
image

imageఎటు చూసినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, బీజేపీకి కూడా కర్ణాటక ఎన్నికల ఫలితాలు చాలా కీలకంగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో కమలనాథులు విజయం సాధించలేకపోతే.. పార్టీలో మోదీ నాయకత్వం మీద కూడా వ్యతిరేకత వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రచారపర్వం మొత్తాన్ని ఒకరకంగా ఒంటిచేత్తో మోసినందున దాని ఫలితం అనుకూలంగా వచ్చినా, ప్రతికూలంగా వచ్చినా ఆ భారాన్ని మోయాల్సింది కూడా మోదీయే అవుతారు. అందుకే విదేశాలకు వెళ్లినప్పుడు కూడా కర్ణాటకను ఏమాత్రం మర్చిపోకుండా కన్నడ జపంచేస్తూ వచ్చిన మోదీ.. బసవణ్ణను ఆకాశానికి ఎత్తేశారు. ప్రచార సభల్లో కూడా వీలైనంత వరకు కన్నడంలో మాట్లాడేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. ఎలాగోలా కన్నడిగుల మనసు గెలుచుకోవాలని విశ్వప్రయత్నాలు చేశారు. వీటన్నింటినీ అత్యంత జాగ్రత్తగా గమనించుకుంటూ వస్తున్న కన్నడ ఓటరు చివరకు ఏం చేస్తారన్నది మాత్రం చూస్తూ ఉండాల్సిందే.

మంగళవారం వరకు వేచి చూడాల్సిందే!!
చంద్రబాబు ప్రధాని మోదీ మీద నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్రానికి సాయం చేస్తానని మాటిచ్చి మోసం చేశారంటూ వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తు న్నారు. ధర్మపోరాట దీక్షచేసి తిరుపతి వెంకన్న సాక్షిగా మోదీ ఏమన్నారో చూడాలంటూ ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఇంత జోరుమీదున్న టీడీపీ అధినేతకు ఒకవైపు కర్ణాటక ఫలితాలు ఏమవుతాయోనన్న ఆందోళన కూడా ఉంది. మరోవైపు మరో తెలుగు రాష్ట్రం, కర్ణాటకకు సరిహద్దు రాష్ట్రమే అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అవసరం, అవకాశం వచ్చినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో మండిపడుతున్న కేసీఆర్.. మోదీ మీద వ్యక్తిగత విమర్శలు మాత్రం చేయడం లేదు. కేంద్రంతో కొట్లాడతామని చెబుతున్నారు. 
దేశమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పార్టీలు, అభ్యర్థుల జాతకాలన్నీ ఈవీఎంలలో భద్రంగా ఉన్నాయి. ఈనెల 15వ తే దీ మంగళవారం నాడు అవన్నీ బయటపడతాయి. ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారన్న విషయాన్ని కేవలం కన్నడి గులు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రమేకాదు. యావద్దేశం చాలా ఆసక్తిగా గమనిస్తోంది. ప్రచారపర్వం కూడా చాలా హో రాహోరీగా సాగింది. ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు కూ డా కాస్తంత గట్టిగానే చేసుకున్నారు. ఏ భాషలోనైనా సరే పావుగంట పాటు కాగితం చూడకుండా రాహుల్ గాంధీ మాటా ్లడగలరా అని ప్రధాని నరేంద్రమోదీ ప్రశ్నించారు. ఇటాలియన్ మూలాలు ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. దానికి రాహుల్ గాంధీ కూడా దీటుగానే సమాధానమిచ్చారు. తాను చేసిన అభివృద్ధి గురించి ప్రధాని ఐదు నిమిషాలు ఆగకుండా చెప్పగ లరా అంటూ ప్రశ్నించడమే కాక.. తన తల్లి చాలామంది కం టే ఎక్కువ భారతీయురాలని, ఆమె జీవితంలో ఎక్కువ కాలం భారతదేశంలోనే గడిచిందని గుర్తుచేశారు. ఇటీవలి కాలంలో రాహుల్‌గాంధీ ఇంత పరిణితితో మాట్లాడటం ఇదే మొదటి సారి. మొత్తానికి ఈసారి ప్రచారపర్వం మాత్రం చాలా వాడివే డిగా సాగింది. కర్ణాటక ఎన్నికలను ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు అటు బీజేపీ కూడా చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దక్షిణాదిన తమకు అధికారం ఇచ్చిన ఏకైక రాష్ట్రం కావడంతో అక్కడ మరోసారి కాషాయ జెండా పాతాలన్నది బీజేపీ లక్ష్యం. దానికితోడు ఇటీవలి కాలంలో ఉత్తరాది-దక్షిణాది అంటూ కొ న్ని వాదనలు వినిపించడం, దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాది పె త్తనం ఎక్కువైందన్న విమర్శలు రావడం నేపథ్యంలో ఇక్కడి గెలుపు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, బీజేపీకి చాలా ము ఖ్యం. అంతేకాదు, మరొక్క ఏడాది సమయంలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎన్ని కలు కావడం.. అందులోనూ కర్ణాటకలో విచిత్రమైన పరిస్థితు లు ఉండటంతో ఈసారి అసలు ఎవరు గెలుస్తారన్న విషయా న్ని కొమ్ములు తిరిగిన ఎన్నికల పండితులు సైతం చెప్పలేక పోతున్నారు. కర్ణాటకలో మరోసారి హంగ్ ఏర్పడుతుందనే చాలామంది అంటున్నారు. అయితే, సెఫాలజిస్టు అవతారం ఎత్తిన ఒక రాజకీయ నాయకుడు మాత్రం సుమారు 120- 130 స్థానాలు సాధించి బీజేపీ నేరుగా అధికారంలోకి వస్తుం దని అన్నారు. ఆయనొక్కరు తప్ప మిగిలిన సర్వేలన్నీ హంగ్ తప్పదనే చెప్పాయి. 

జేడీ(ఎస్) కీలకం కాబోతుందా?
కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కంటే కాస్తంత ఎక్కువ అసెంబ్లీ స్థానాలు వచ్చినా, సొంతంగా అధికారం చేపట్టే పరిస్థితి ఉండ దన్నాయి. దాంతో తప్పనిసరిగా ఎవరు అధికారంలోకి రావా లన్నా వారికి జేడీ(ఎస్) మద్దతు ఉండాల్సిందేనని దాదాపు గా తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికల మీద చాలా ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న సిద్ద రామయ్య ప్రభుత్వం మీద మరీ ఎక్కువగా ప్రజల్లో వ్యతిరేక త లేకపోవడం, పైపెచ్చు లింగాయత్‌లకు మైనారిటీ మత హో దా కల్పిస్తానని హామీ ఇవ్వడం.. ఇలాంటివాటి నేపథ్యంలో తమకు అనుకూల పరిస్థితులే ఉంటాయని రాహుల్ బృందం నమ్ముతోంది. అంతేకాక, బీజేపీ నుంచి గాలి జనార్దనరెడ్డి సోదరుడు సోమశేఖరరెడ్డితో పాటు.. ఆయన అత్యంత సన్ని హితుడైన శ్రీరాములుకు కూడా టికెట్ ఇవ్వడంతో.. గనుల ఘనుల గురించి కాస్తంత గట్టిగానే ప్రచారం చేయడానికి కాంగ్రెస్‌కు అవకాశం చిక్కింది. దాంతో తమకు మరోసారి అధికారం చేపట్టే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. అంతేకాక.. ఇటీవలి కాలంలో జరిగిన దాదాపు అన్ని ఎన్ని కల్లోనూ (ఒక్క పంజాబ్ తప్ప) ఘోర పరాజయాలు చవిచూ స్తూ, వరుసగా అధికారాన్ని కోల్పోతుండటంతో.. చేతిలో ఉ న్న అధికారాన్ని వదులుకోవడం చాలా కష్టంగా ఉంటుందని కాంగ్రెస్ అధినాయకత్వానికి బాగా అర్థమైంది. అందుకే ఈసా రి మొత్తం శక్తులన్నింటినీ కూడగట్టుకుని మరీ కన్నడనాట ప్రచార పర్వాన్ని హోరెత్తించారు. ఒకసారి గతంలో జరిగిన కర్ణాటక ఎన్నికల తీరును చూస్తే.. ఆ రాష్ట్ర ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో అంచనా వేసేందుకు కొంత అవకాశం ఉంటుంది. 

గత ఫలితాలు ఏం చెబుతున్నాయి?
2004 ఎన్నికలు కర్ణాటక చరిత్రలోనే అత్యంత చిత్రమైనవి. ఆ ఎన్నికల్లో 79 స్థానాలు గెలుచుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించినా, కాంగ్రెస్ 65 స్థానాల తోను, జేడీఎస్ 58 స్థానాలతోను నిలబడి.. ఆ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 99 ఎన్నికల్లో సాధించిన సీట్లలో (132) సరిగ్గా సగం కూడా రాని కాంగ్రెస్.. తమకు దేవెగౌడ ఇచ్చిన స్నేహహస్తం పుణ్యమాని అధికారం చేపట్ట గలిగింది. అయితే, నాలుగేళ్ల తర్వాత దేవెగౌడ కుమారుడు కుమారస్వామి ప్లేటు ఫిరాయించడంతో ప్రభుత్వం కుప్పకూ లింది. ఒక ఏడాది ముందుగానే ఎన్నికలు జరిగాయి. 2008లో జరిగిన ఆ ముందస్తు ఎన్నికల్లో బీజేపీ 49.1 శాతం ఓట్లతో 110 సీట్లు గెలుచుకుని సొంతంగా అధికారం చేపట్టింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి 35.7% ఓట్లు వచ్చాయి. మిగిలినవాటిని జేడీఎస్, ఇతరులు పంచుకున్నారు. ఆ ఎన్నిక ల్లో పోలైన మొత్తం ఓట్లు కేవలం 64.68% కావడం గమనా ర్హం. 2004 ఎన్నికల్లో 79 స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ.. రెట్టించిన ఉత్సాహంతో 31 స్థానాలు అధికంగా గెలుచుకుంది. కాంగ్రెస్ కూడా అంతకుముందు కంటే తన బలాన్ని కొంత పెంచుకుంది. 2004లో 65 సీట్లు సాధించిన కాంగ్రెస్‌కు 2008 లో 80 స్థానాలు వచ్చాయి. జేడీఎస్ మాత్రం తన బలాన్ని గణనీయంగా కోల్పోయింది. 2004లో 58గా ఉన్న ఆ పార్టీ బలం 28కి పడిపోయింది. 2013 ఎన్నికలలో ఈ ఫలితాలు మళ్లీ తిరగబడ్డాయి. కాంగ్రెస్ పార్టీ 54.3 శాతం ఓట్లతో బీజేపీ నుంచి అధికారాన్ని లాక్కుంది. బీజేపీ కేవలం 17.9% ఓట్లు మాత్రమే సాధించి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. జేడీఎస్ కూడా అదే స్థాయిలో 17.9% ఓట్లు సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 121 స్థానాలు రాగా, బీజేపీ - జేడీఎస్ రెండూ తలో 40 సీట్లు మాత్రమే సాధించాయి. కర్ణాటక ఎన్నికల చరి త్రలోనే 35 సంవత్సరాలలో రెండో అత్యధిక ఓటింగ్... 71.3% ఈ ఎన్నికలలో నమోదు కావడం మరో విశేషం. 1978లో అత్యధికంగా 71.9 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత ఇంత పెద్దమొత్తంలో ఓట్లు ఎప్పుడూ పడలేదు. 
కర్ణాటకలో ఎవరు విజయం సాధిస్తారనే విషయం మీద చాలా అంశాలు ఆధారపడి ఉన్నాయి. కేవలం రెండు పార్టీల భవితవ్యాన్ని నిర్దేశించడమే కాదు.. ఈ ఎన్నికల ఫలితాలను బట్టే రాబోయే కాలంలో దేశ రాజకీయాలు ఎలా ఉండబోతు న్నాయన్న విషయం కూడా సుమారుగా తెలిసిపోతుంది. ఒక వేళ బీజేపీ గెలిస్తే.. మోదీ బలం ఒక్కసారిగా మళ్లీ పెరిగిపో తుంది. ఇటీవలికాలంలో వరుసగా విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటివాళ్లు పెద్దమొత్తంలో అప్పులు ఎగ్గొట్టి విదేశా లకు పారిపోవడం, దేశంలోని పలు ప్రాంతాలలో బాలికలపై అత్యాచారాలు, వాటిలోని ఒక ఘటనలో అయితే ఏకంగా బీజేపీ ఎమ్మెల్యే పాత్ర కూడా ఉండటం.. ఇలాంటి పరిణా మాల కారణంగా మోదీ ప్రతిష్ఠ కొంత మసకబారింది. దానికి తోడు పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ లాంటి సంచలన నిర్ణయాల వల్ల సామాన్యుడిపై భారం పెరిగిందన్న వాదన కూడా వినిపి స్తోంది. 2014 ఎన్నికల సమయంలో అంతా ‘అబ్ కీ బార్ మోదీ సర్కార్’ అనే మంత్రాన్ని జపించినంతగా ఇప్పుడు పరి స్థితి లేదు. 

తెలుగురాష్ట్రాల్లో ఆసక్తి
ఇలాంటి తరుణంలో మళ్లీ ఒకవేళ కర్ణాటక పీఠాన్ని సాధించగలిగితే.. మోదీ అమాంతం బలం పుంజుకుంటా రనడంలో సందేహం లేదు. ఆ తర్వాతి కాలంలో ఆయనను ఢీకొట్టడానికి ఇతర శక్తులు కూడా కొంత వెనకాడే పరిస్థితి ఉండచ్చు. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లాం టి వాళ్లు చాలామంది కర్ణాటక ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చవి చూస్తే.. మోదీ హవా తగ్గిందన్న విషయాన్ని చూపించి కేం ద్రం మీద పోరును ఒక్కసారిగా తీవ్రస్థాయికి తీసుకెళ్లి, ఇతర ప్రాంతీయ పార్టీలను కూడా కలుపుకొని ఉధృతంగా తిరగబడే అవకాశం ఉంటుంది. నాలుగేళ్ల పాటు ఎన్డీయేలో భాగస్వామి గా ఉన్న తెలుగుదేశం పార్టీ.. ఇటీవలే కేంద్ర మంత్రివర్గంతో పాటు ఎన్డీయే నుంచి కూడా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అప్పటినుంచి చంద్రబాబు ప్రధాని మోదీ మీద నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్రానికి సాయం చేస్తానని మాటి చ్చి మోసం చేశారంటూ వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తు న్నారు. ధర్మపోరాట దీక్షచేసి తిరుపతి వెంకన్న సాక్షిగా మోదీ ఏమన్నారో చూడాలంటూ ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఇంత జోరుమీదున్న టీడీపీ అధినేతకు ఒకవైపు కర్ణాటక ఫలితాలు ఏమవుతాయోనన్న ఆందోళన కూడా ఉంది. పొరపాటున బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రం మోదీ రెట్టించిన ఉత్సా హంతో అడుగులు కదుపుతారని, తనమీద ఉన్న ఆరోపణ లకు సంబంధించిన కేసులను తిరగదోడే ప్రమాదం ఉందని కూడా చంద్రబాబుకు తెలుసు. ఆ విషయాన్ని ఆయన పదే పదే చాలా సందర్భాలలో బహిరంగ వేదికల నుంచి అధికారిక సమావేశాలలో కూడా ప్రస్తావిస్తున్నారు. మరోవైపు మరో తెలుగు రాష్ట్రం, కర్ణాటకకు సరిహద్దు రాష్ట్రమే అయిన తెలంగా ణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం చాలా ఆచితూచి అడుగు లు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అవసరం, అవకాశం వచ్చినప్పు డల్లా కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో మండిపడుతున్న కేసీఆర్.. మోదీ మీద వ్యక్తిగత విమర్శలు మాత్రం చేయడం లేదు. కేంద్రంతో కొట్లాడతామని చెబుతున్నారు. ఇటీవల రైతుబంధు పథకం ప్రారంభోత్సవంలో కూడా ఆయన కేంద్రా న్ని తూర్పారబట్టారు గానీ వ్యక్తిగత విమర్శలకు తావివ్వలేదు. జాతీయస్థాయిలో అన్ని ప్రాంతీయ పార్టీలను కూడగట్టుకుని డెమొక్రాటిక్ ఫ్రంట్ ఏర్పాటుచేయడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్న కేసీఆర్.. సహజంగానే కర్ణాటక ఎన్నికల ఫలితాలను చూసి, ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

అందువల్ల ఎటు చూసినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి, బీజేపీకి కూడా కర్ణాటక ఎన్నికల ఫలితాలు చాలా కీలకం గా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో కమలనాథులు విజయం సాధించలేకపోతే.. పార్టీలో మోదీ నాయకత్వం మీద కూడా వ్యతిరేకత వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రచారపర్వం మొత్తా న్ని ఒకరకంగా ఒంటిచేత్తో మోసినందున దాని ఫలితం అను కూలంగా వచ్చినా, ప్రతికూలంగా వచ్చినా ఆ భారాన్ని మో యాల్సింది కూడా మోదీయే అవుతారు. అందుకే విదేశాలకు వెళ్లినప్పుడు కూడా కర్ణాటకను ఏమాత్రం మర్చిపోకుండా కన్నడ జపంచేస్తూ వచ్చిన మోదీ.. బసవణ్ణను ఆకాశానికి ఎత్తే శారు. ప్రచార సభల్లో కూడా వీలైనంత వరకు కన్నడంలో మాట్లాడేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. ఎలాగోలా కన్నడిగుల మనసు గెలుచుకోవాలని విశ్వప్రయత్నాలు చేశారు. వీటన్నిం టినీ అత్యంత జాగ్రత్తగా గమనించుకుంటూ వస్తున్న కన్నడ ఓటరు చివరకు ఏం చేస్తారన్నది మాత్రం చూస్తూ ఉండా ల్సిందే. మంగళవారం వరకు వేచి చూడాల్సిందే!!

Tags
English Title
What is Kannada Nadi?
Related News