మూడు వేలు ఇస్తేనే మృతదేహం కదిలేది..  

Updated By ManamSun, 06/17/2018 - 16:47
Man asks bribe, Rs 3000, bodies family, post-mortem
  • లంచం ఇచ్చాకే సంబంధిత కుటుంబాలకు మృతదేహం అప్పగింత

  • పోస్టుమార్టం పూర్తి అయిన తరువాత మార్చురీ సిబ్బంది డిమాండ్ 

  • కోయంబత్తూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఘటన.. వీడియో వైరల్ 

Man asks bribe, Rs 3000, bodies family, post-mortemకోయంబత్తూరు: అనారోగ్యంతో ఆస్పత్రులకెళ్తే లక్షల బిల్లు వేసి ప్రాణాలు తోడేస్తున్నారనుకుంటే.. మరోవైపు మార్చురీలోని మృతదేహాలను అప్పగించేందుకు కూడా లంచాలకు కక్కుర్తిపడుతున్నారు. పోస్టుమార్టం పూర్తిన తరువాత మృతదేహాలను సంబంధిత కుటుంబ సభ్యులుకు ఇవ్వాలన్నా లంచం ఇవ్వాల్సిందేనట. లేదంటే మృతదేహం మార్చురీ నుంచి కదలదు. ఈ ఘటన ఎక్కడో కాదు.. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఓ ప్రభుత్వాసుపత్రిలో వెలుగుచూసింది. పోస్టుమార్టం పూర్తి అయిన తరువాత మార్చురీలో నుంచి మృతదేహాలను సంబంధికులు తీసుకెళ్లాలంటే అక్కడి సిబ్బంది వారినుంచి ఏకంగా రూ.3వేలు డిమాండ్ చేస్తున్నారు. మార్చురీలో పనిచేసే పరమశివం అనే ఉద్యోగి.. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను సంబంధిత కుటంబసభ్యులకు అప్పగించేందుకు మూడు వేలు డిమాండ్ చేశాడు.

బాధితులు అంత ఇచ్చుకోలేమని ప్రాధేయపడుతున్నప్పటకీ అతడు ఒప్పుకోవడం లేదు. లెక్క ఎక్కువైనా పర్వాలేదు.. గానీ రూపాయి తక్కువైతే తీసుకొనేది లేదంటూ తిట్టిపోస్తున్నాడు. ఇలాంటి చర్యలకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాల్సిన పోలీసుల సమక్షంలోనే ఈ వ్యవహారం జరుగుతున్నా ఏం పట్టనట్టు ఉండిపోవడం దురదృష్టకరం. గతంలో ఒకసారి పరమశివంను సస్పెండ్ చేసినప్పటికీ.. అతను మళ్లీ తిరిగి ఉద్యోగంలో చేరినట్టు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే ఆ వీడియో.. 

English Title
Watch: Man asks bribe of Rs 3000 to release bodies to the family after post-mortem
Related News