చింతమడకలో  ఓటు వేయనున్న సీఎం

kcr

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటు హక్కును చింతమడక గ్రామంలో వినియోగించుకోనున్నారు.  ఆపద్ధర్మ సీఎం ఓటు వేసే పోలింగ్ బూత్‌ను, హెలిప్యాడ్ ప్రాంతాలను పోలీసు కమిషనర్ జోయెల్ డేవిస్ గురువారం పరిశీలించారు. చింతమడకలో పోలీసు లు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్దిపేట నియోజక వర్గం చింతమడక లో కేసీఆర్‌కు ఓటు ఉంది. హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తున్న టీపీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన ఓటు హక్కును కోదాడలో వినియో గించుకోబోతున్నారు. ఆయనకు కూడా పోటీ చేస్తున్న నియోజక వర్గంలో ఓటు లేదు. సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు ఓటు హక్కును వినియోగించుకోబో తున్నారు. మంత్రి కేటీఆర్ ఖైరతాబాద్ నియోజక వర్గంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లోని నిజామియా హై స్కూల్ పోలింగ్ బూత్‌లో, ఎంపీ కవిత బోధన్ నియోజక వర్గంలోని పోతంగ ల్‌లో, కాంగ్రెస్ స్టార్‌క్యాంపెయినర్ విజయశాంతి  ఎమ్మెల్యే కాలనీలోని యూరోకిడ్  స్కూల్‌లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. జూబ్లీహిల్స్ క్లబ్ పోలింగ్ బూత్‌లో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

Tags

సంబంధిత వార్తలు