పర్యటన పరమార్థం?

Updated By ManamMon, 05/14/2018 - 23:55
modi

imageప్రతి రాజకీయ కదలికను అత్యంత అప్రమత్తంగా, దూరదృష్టితో వేయగల వ్యూహాత్మక రాజకీయవేత్త నరేంద్ర మోదీ. ఎన్నికల సమయంలో దేవాలయాలను సందర్శించడం మోదీకి కొత్తేమి కాదు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్‌లోని దేవాలయాల సందర్శనపై కాంగ్రెస్ సహా పలువురు విమర్శించడాన్ని తప్పుపట్టలేము. కర్ణాటక ప్రజలు ఓటువేస్తున్న రోజునే (మే 12వ తేది) ఆయన ఖాట్మండులోని పశుపతినాథ్, ముక్తినాథ్ ఆలయాల్ని సందర్శించడంపై వివాదాస్పదంగా మారింది. కర్ణాటక లోని ప్రధాన ఓటుబ్యాంకు అయిన లింగాయత్ సామాజిక సమూహం ఆరా దించే పరమేశ్వరుడి గుడిని ఆ రోజునే సందర్శించడం మోదీ రాజకీయ చతు రతలో భాగమేనని పలువురు విమర్శిస్తున్నారు. గతంలో గుజరాత్ ఎన్నికల సమ యంలో మోదీ రోడ్ షోలు, ఆలయ సందర్శన విజువల్స్‌ను టీవీ చానెల్స్‌లో పదే పదే చూపిస్తూ, ఓటర్లను పెద్ద ఎత్తున ప్రభావితం చేశాయి. ఈ అనుభవం నేపథ్యంలో రాజకీయ పక్షాల ఫిర్యాదు మేరకు మోదీ ఆయా ఆలయాలను సంద ర్శిస్తున్న వార్తలను, వీడియో విజువల్స్‌ను కర్ణాటకలో ప్రసారం చేయకూడదని ఎన్నికల కమిషన్ కఠినమైన ఆదేశాలను జారీ చేసింది. అయితే మోదీ నేపాల్ పర్యటన అప్పటికప్పుడు తీసుకున్నది కాదని, గత నెలలో నేపాల్ ప్రధానమంత్రి ఓలి భారత్‌లో పర్యటించినపుడే ఆయన పర్యటన నిర్ణయమైందని, దానిపై అనవ సర రాద్ధాంతం తగదని కేంద్రం ప్రకటించింది. 

కర్ణాటక ఎన్నికల రాజకీయపు ఎత్తుగడల మాట ఎలా ఉన్నా, మోదీ మూడ వసారి నేపాల్ పర్యటనలో ప్రతీకాత్మకత పెద్ద ఎత్తున ప్రతిబింబిస్తోంది.  భారత్- నేపాల్ సరిహద్దులోని (బీహార్ సరిహద్దుల్లో) జానకిపూర్‌లోని జానకి ఆలయాన్ని సందర్శన, జనక్‌పూర్-అయోధ్య బస్ సర్వీస్ ప్రారంభం, పౌర సమావేశంలో ప్రసంగంతో మోదీ తన నేపాల్ పర్యటనను ప్రారంభించారు. ఆలయ సందర్శ నలతో పాటు ఖాట్మండులోని అనేక రాజకీయ కార్యక్రమాల్లో ఆయన పాల్గొ న్నారు. నేపాల్ ప్రధాని కెపి ఓలి, ఆయన ప్రభుత్వ ప్రతినిథులు, మాజీ ప్రధా నులు ప్రచండ, షేర్ బహదూర్ దేవ్‌బా, ప్రతిపక్షనాయకులతో సమావేశమ య్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక ప్రాజెక్టులపై కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా నాలుగు అంతరార్థాలు ఇమిడి ఉన్నా యి. మొదటగా మతం, సంస్కృతి సాధనాలుగా నేపాల్ ప్రజలు, పాలకు లతో సంబంధాలను బలోపేతంగా చేసుకోవాలని మోదీ ప్రభుత్వం ప్రయత్ని స్తోంది. ప్రధానంగా డబ్బు, సంధాయకత హామీల ఆధారంగా భారత పొలి మేరల్లోకి చైనా వాళ్ళ చొరబాటు నేపథ్యంలో ఈ పద్ధతిని అనుసరిస్తోంది. బీజింగ్ బలంతో నేరుగా పోటీ పడటం కంటే, సంప్రదాయ బంధాలను కీలకంగా వినియోగిం చుకొని ఆధునిక అవకాశాలను అందిపుచ్చుకోవాలని న్యూఢిల్లీ ప్రయత్ని స్తోంది. రెండవది, నేపాల్ ప్రజల తీర్పును తాము గౌరవిస్తామని ఆ ప్రభుత్వానికి తెలియ జెప్పడమే కాకుండా, భారత వ్యతిరేకత కలిగిన ఓలి ప్రభుత్వాన్ని చిన్నచూపు చూడడం లేదా కూల్చేందుకు ప్రయత్నించడం వంటి ప్రయత్నాలు చేయబోవడం లేదని సందేశాన్నివ్వడం. ఎందుకంటే, గతంలో 2005లో నేపాల్ రాజరిక వ్యతిరేక ఉద్యమానికి, తిరుగుబాటుకు భారతప్రభుత్వం క్రియాశీలకంగా సహక రించడం, 2015లో నేపాల్ రాజ్యాంగ నిర్మాణ సమయంలో మదేశీలకు ప్రత్యేక హక్కులు కల్పించాలని భారత్ పట్టుబట్టడం వంటివి. అలాంటిది ‘మీ రాజకీ యాలు మీవి, వాటిలో మా జోక్యమేదీ ఉండద’ని నేడు నేపాల్‌కు భారత్ పదేపదే స్పష్టం చేస్తోంది. 

మూడవ అంశమేమంటే... నేపాల్ పొరుగు దేశం మాత్రమే కాదని న్యూఢిల్లీ భావిస్తోంది. ఇరుదేశాలకు మధ్య ఆంక్షలులేని సరిహద్దులుండడమే కాకుండా, చైనా పాత్ర పెరుగుతుండడంతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత సున్నితత్వాన్ని సంతరించుకున్నాయి. నేపాల్ అంతరంగిక వ్యవహారాల్లో అసలు జోక్యం చేసుకో మంటే, ద్వైపాక్షిక కార్యక్రమాలు ఉండవని అర్థం చేసుకోరాదని ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ దౌత్య విధానంలో భాగంగా నేపాల్ రాజకీయ పక్షాల న్నిటితో మోదీ సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై లోతైన చర్చలు చేశారు. నేపాలీ ప్రజాస్వామ్యం మరింత సంపదవంతమయ్యేందుకు భారత్ సహ కరిస్తుందన్న భరోసా ఇచ్చారు. జానకిపూర్  పర్యటన ద్వారా మదేశీ ప్రజలకు భారత్ మద్దతు ఇప్పటికీ కొనసాగుతుందన్న సంకేతాన్ని మోదీ పర్యటన వ్యక్తం చేస్తుంది. చివరిగా, విద్యుత్, రైల్వేలు, జల రవాణా, రోడ్లు తదితర ప్రాజెక్టులపై ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేసే బాధ్యత భారత్‌పై ఉంది. రద్దయిన పెద్దనోట్లను మార్చుకునేందుకు తమ దేశస్తులను అనుమతించాలని నేపాల్ ప్రధాని అభ్యర్థనపై భారత్ సానుకూల నిర్ణయం సకా లంలో తీసుకోవాల్సి ఉంది. శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో చైనా వివాదాస్పద వైఖరి నేపథ్యంలో ఆ దేశ సహకారంపై అంతర్జాతీయంగా అనేక ఆందోళనకరమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ పర్యటన సంకేతాలను సవ్యంగా వినియోగించుకొని ఇరు దేశా ల మధ్య సంబంధాలను సుస్థిరం చేసుకోవాల్సిన బాధ్యత ఓలిపైనా అంతే ఉంది. వేగంగా మారుతున్న భౌగోళిక రాజకీయ యవనికలో అమెరికా ఆధీన విధానం కాక, అలీనం విధానంతో పొరుగు రాజ్యాలతో ద్వైపాక్షిక సంబంధాలను భారత్ సుస్థిరం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

English Title
To visit the tour?
Related News