‘వీర భోగ వసంత రాయలు’ ప్రీ లుక్ 

Updated By ManamThu, 07/12/2018 - 12:18
VBVR
VBVR

నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియ, శ్రీవిష్ణు ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం ‘వీర భోగ వసంత రాయలు’. ఇంద్రసేన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర ప్రీ లుక్ తాజాగా విడుదలైంది. ఓ మనిషిని కిందికి వేలాడదీసినట్లుగా ఉన్న ఈ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రాన్ని బాబా క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై అప్పారావు నిర్మిస్తుండగా.. కె.రాబిన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

English Title
Veera Bhoga Vasantha Rayalu pre look
Related News