జగన్, పవన్‌లపై వర్ల రామయ్య కామెంట్స్ 

Updated By ManamThu, 11/08/2018 - 20:00
Varla Ramaiah, Ys Jagan mohan reddy, Pawan Kalyan

Varla Ramaiah, Ys Jagan mohan reddy, Pawan Kalyanవిజయవాడ: వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే జోగి రమేశ్ వంద రెట్లు బెటర్ అని ఏపీ ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య విమర్శించారు. వ్యవస్థను గౌరవించి స్టేషన్‌కు హాజరయ్యారని ఆయన ప్రశంసించారు. గురువారం వర్ల రామయ్య విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధినే పవన్ కల్యాణ్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. పవన్ పరిణితి లేని నాయకుడు.. రాతి నేలపై నాటిన మొక్కలాంటివాడని దుయ్యబట్టారు.

ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాకు పవన్ అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీ విలీనం తప్పనిపించలేదా? అని ప్రశ్నించారు. కోడి కత్తి డ్రామా రక్తి కట్టించి జగన్ రెస్టు తీసుకున్నాడని వర్ల విమర్శించారు. బీజేపీకి మానసపుత్రుడు గాలి జనార్ధన్ రెడ్డి అని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.  

English Title
Varla Ramaiah comments on Ys Jagan, Pawan Kalyan
Related News