వరుని కంటే వధువు వయసు ఎక్కువుంటే పెళ్లి చేయవచ్చా?   

Updated By ManamMon, 07/09/2018 - 23:14
image

వరుని వయసుకంటే వధువు వయసు ఎక్కువ ఉంటే వివాహం చేయవచ్చా?   

అబ్బాయి వయసుకంటే అమ్మాయి వయసు ఎక్కువ ఉండకూడదనే శాస్త్రం చెబుతోంది. ‘‘బాలార్క ప్రేత ధూమశ్చ - వృద్ధ స్త్రీ పల్వలోదకం  - రాత్రౌ దద్ద్యాన్న భోజ్యశ్చ - ఆయుక్షీణం దినందినం’’ ఉదయం సమయంలోని ఎండ, శవం కాలుతున్న పొగను పీల్చడం, తన కన్నా పెద్దదైన స్త్రీని వివాహం చేసుకోవడం, చిన్నచిన్న గుంటల్లో నీరు తాగడం, రాత్రి పూట పెరుగన్నం తినడం వల్ల రోజురోజుకూ ఆయువు క్షీణిస్తుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. అందులోనూ ఆడవారికి శారీరక మార్పులు చాలా వేగంగా మొదలవుతాయి. అమ్మాయి వయసు చిన్నదైనప్పుడే అనుకూల దాంపత్యం సిద్ధిస్తుంది.  విజ్ఞానశాస్త్రం కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది.
 - డా. అన్నదానం చిదంబర శాస్త్రి, ఆధ్యాత్మిక వేత్త

image

 

English Title
వరుని కంటే వధువు వయసు ఎక్కువుంటే పెళ్లి చేయవచ్చా?   
Related News