ఒకేసారి రెండు సినిమాలు...

Updated By ManamTue, 10/23/2018 - 03:25
gopichand

image‘పంతం’ సినిమాతో 25 సినిమాలు పూర్తి చేసుకున్న హీరో గోపీచంద్.  ప్రస్తుతం కొత్త దర్శకుడితో లవ్‌స్టోరీ చేస్తున్నారు. ఇది పూర్తి కావచ్చింది. ఇప్పుడు గోపీచంద్ రెండు సినిమాల్లో నటించడానికి సిద్ధమైపోతున్నారు. అందులో ఒకటి శ్రీవాస్ దర్శకత్వంలో ఉంటుందని సమాచారం. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయట. కాగా.. మరో సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయాలనుకుంటున్నారట. గోపీచంద్ మలినేని, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కాల్సి ఉంది. అయితే కొన్ని కారణాలతో ఈ సినిమా హోల్డ్‌లో పడింది. దీంతో గోపీచంద్‌తో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు గోపీచంద్ మలినేని. మరో పక్క సంపత్ నంది కూడా గోపీచంద్ కోసం స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తునారట. 

English Title
Two films at once ...
Related News