కుండపోత

Updated By ManamTue, 08/21/2018 - 00:24
Kaddam-proj
  • వానలతో తెలంగాణలో స్తంభించిన జనజీవనం

  • భూపాలపల్లి జిల్లాలో ముగ్గురు మృతి.. 

  • బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేడు, రేపు భారీ వర్షాలు

Kaddam-projతెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులుగా విస్తారంగా కురు స్తున్న వర్షాలకు పంటలు నీట మునిగాయి. బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడంతో నేడు, రేపు భారీ వర్షాలు  కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. వర్షాలతో ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా అతలాకుతలం అవుతోంది. సుమారు 1.50 లక్షల ఎకరాల్లో పత్తి, సోయా  బీన్, కంది పంటలు నీటిలో మునిగిపోయాయి. రూ.75 కోట్ల వరకు పం ట  నష్టం వాటిల్లినట్లు స్థానిక వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమి కంగా అంచనా వేశారు.సుమారు లక్ష ఎకరాల్లో పత్తి   పంట దెబ్బతిన్నట్లు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షానికి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు గ్రామాలు జలమయమయ్యాయి. కొత్త గూడెం, మణుగూరు, ఇల్లెందు ఏరియాల్లోని ఓపెన్ కాస్ట్ గనుల్లో   నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో వాగులు పొంగి ప్రవహిస్తుం  డటంతో సుమారు 60 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. తాలిపేరు ప్రాజెక్ట్కు భారీగా వర ద చేరుతుండడంతో 9గేట్లు   ఎత్తి 19వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదులున్నారు. భద్రా చలం, బూర్గంపాడు, దుమ్ము గూడెం మండలాల్లో పత్తి,  జామాయిల్, వరి పంటలు నీట మునిగాయి. కుమ్రం భీం జిల్లాలోని వెంకట్రావుపేట సమీపం లో వంతెన పైనుంచి  పెన్గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. తరోడా, ఆనందాపూర్ సమీపంలో రోడ్లు తెగిపోయాయి. దీంతో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు స్తంభించాయి. బాసర వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కుంటాల, గాయత్రి,  పొచ్చెర జలపాతాల్లోకి వరద పోటెత్తుతోంది. కడెం, గడ్డెన్నవాగు ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయి. నిజామాబాద్ జిల్లా  కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి నది శివాలయాన్ని ఆనుకొని ప్రవహిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని  ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటి మట్టం పెరిగింది. అధికారులు మొదటి  ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఆయా ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు.

మహబూబాబాద్ జిల్లాలో ఆదివారం వరకు  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు నిండిపోయాయి. చాలా చోట్ల రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్‌లో 14.78 సెంటీమీటర్లు,  గార్లలో 12.58 సెం.మీ, బయ్యారంలో 12.34 సెం.మీ, డోర్నకల్లులో 11.82 సెం.మీ వర్షం కురిసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాకతీయ ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో వరద నీరు చేరి ఉత్పత్తి నిలిచిపోయింది.  12వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. సుమారు రూ. 12కోట్లు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా.పకృతి ప్రకోపానికి జన జీవనం అతలాకుతలం అవుతోంది.  గడిచిన కొద్ది రోజులుగా జిల్లా  భారీ వర్షాలతో జనజీవనం పూర్తిగా  స్థంభించింది. వర్షాల తాకిడికి జిల్లాలోని ప్రాజెక్టులు మేడిగడ్డ, దాని అనుబంధ కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులతో పాటు తుపాకుల గూడెం ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. బొగ్గు గనుల్లో  ఉత్పత్తి నిలిచిపోగా సింగరేణికి  కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. జిల్లాలోని రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాలు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాయి.  కన్నాయిగూడెం, మంగపేట, మహదేవపూర్, పలిమెల తదితర మండలాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను పోలీసులు అ ప్రమత్తం చేస్తున్నారు. దెబ్బతిన్న రోడ్ల వద్ద ప్రమాద సూచికలను ఏర్పాటుచేస్తున్నారు. గోదావరి తీరం వెంట ఉన్న  గ్రామాల ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. భారీ వర్షాలతో రైతులు వ్యవసాయం సీజన్ మొదట్లోనే నష్టాలను  చవిచూశారు. దీంతో జిల్లాలో ప్రధాన సాగైన మిరప పంట ప్రస్తుతం నారుమడుల  ఏర్పాటు దశలో ఉండగా వర్షాల  దాటికి విత్తనాలు కొట్టుకుని పోగా కొన్ని చోట్ల మొలచిన నారు కొట్టుకుని పోయింది. దీంతో రైతులు వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే తీవ్ర నష్టాలను చవిచూశారు.  మంగపేట మండలం రాజుపేటలో ఒక్కరు , మహదేవపూర్ మండలం సూరారంలో ఒక్కరు, పలిమెల మండలంలో ఒక్కరు మృత్యువాత పడ్డారు.  జిల్లాలోని చెరువులన్నీ పూర్తి స్థాయిలో నిండి మత్తడులు దునుకుతుండగా పైనుండి వస్తున్న వరదతో ప్రమాదకరంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో విస్తారంగం వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తుతోంది. ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీమ్, మంచిర్యాల జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి.  మంచిర్యాల జిల్లా, నీల్వాయివాగు, సుద్దాలవాగు, బతుకమ్మ వాగులు ప్రమాదకరస్థాయిలో పొంగుతున్నాయి.

బీమిలి మండలం, రాంపూర్ ఎర్రవాగు, వాడాల ఎర్రవాగులు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి.ఖమ్మంజిల్లాలో కారేపల్లి మండలంలో మద్దులపల్లి బుగ్గ వాగులు నిండి నీరు రైలు పట్టాలపైకి చేరింది. దీంతో పత్తి, వరి పంటలు నీట మునిగాయి. కారేపల్లి ఇల్లందు మద్య రాకపోకలు నిలిచిపోయాయి.ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. నాగార్జునసాగర్ వైపునకు కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతోంది.  శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు చేరుకోవడంతో  శ్రీశైలంలో రెండు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ, అలాగే ఎనిమిది క్రస్ట్ గేట్లను ఎత్తి సాగర్కు 2,34,937 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో  532 అడుగులుగా ఉన్న సాగర్ నీటిమట్టం ఒక్క రోజులోనే 10 అడుగుల మేరకు పెరిగింది. మరో వారంపాటు నీటి రాక ఇలాగే కొనసాగితే సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ఠస్థాయి 590 అడుగులకు చేరుకుంటుందని ప్రాజెక్టు అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. నల్లగొండ జిల్లాని వేములపల్లి మండలంలో అత్యధికంగా 107.8 మి.మీ వర్షపాతం నమోదు కాగా, అతి తక్కువ వర్షపాతం డిండి మండలంలో 8.4 మి.మీ వర్షపాతం నమోదైంది. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకోవడంతో దిగువనున్న నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతుంది. ఎడమ కాల్వ ఆయకట్టు రైతులకు ఈనెల 22వ తేది నుండి 33 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.  జిల్లాలోని ప్రతి ఇంచు భూమికి నీరు అందించి రైతాంగానికి భరోసా కల్పించాలన్న లక్ష్యంగా జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. 33 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఏడు తడుల్లో నవంబర్ చివరి వరకు నీటిని విడుదల చేసి ఎస్‌ఎల్‌బిసి చెరువులను నింపేందుకు గాను 12 టీఎంసీలు కేటాయిస్తున్నట్లు సమాచారం.  శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగరుకు నీరు విడుదల చేయడంతో కృష్ణా బ్యాక్వాటర్ ఉధృతి పెరిగి కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని పంటపొలాలు నీట మునిగిపోయాయి.  నేరేడుగొమ్ము, చందంపేట మండలాలలోని గ్రామాల్లోని పొలాలకు నీరు ముంచెత్తుతోంది. జగిత్యాల జిల్లా కోరుట్లలో చెరువులు, కుంటలు నిండి మత్తడి పారుతూ పొంగి పొర్లుతున్నాయి. అలాగే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1091 అడుగులు ఉండగా ఇందులో భారీ వర్షానికి 1076 అడుగులకు చేరింది. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

English Title
Torrential
Related News