ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

Updated By ManamSun, 07/22/2018 - 08:57
Encounter

Three Terrorists Shot Dead In Kashmir'

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాం జిల్లాలో శుక్రవారం రాత్రి ఓ కానిస్టేబుల్‌ను ఉగ్రవాదులు అపహరించి హత్య చేసిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ సంయుక్తంగా కూంబింగ్‌ చేపట్టారు. ఈ సందర్భంగా  ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ప్రతిగా జవాన్లు ధీటుగా సమాధానమిచ్చారు.  కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. కాగా మొత్తం నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. ఇప్పటికే ముగ్గురిని మట్టుపెట్టిన జవాన్లు మరొకరి కోసం గాలిస్తున్నారు.

 కథువాలో శిక్షణలో ఉన్న కానిస్టేబుల్‌ సలేం అహ్మద్‌ షా సెలవుపై సొంతూరు వచ్చాడు. మొన్న రాత్రి అతడి నివాసంపై ఉగ్రవాదులు దాడి చేసి బంధించి తీసుకువెళ్లారు. విషయం తెలిసి భద్రతాదళాలు గాలింపు చర్యలు చేపట్టగా ఆ గ్రామానికి సమీపంలోని ఓ పొలంలో అహ్మద్‌ షా మతృదేహం లభించింది. కాగా నెలరోజుల క్రితం ఔరంగజేబ్‌ అనే కానిస్టేబుల్‌ను కిడ్నాప్‌ చేసిన ఉగ్రవాదులు అతడిని కూడా హతమార్చిన విషయం తెలిసిందే.

English Title
Three Terrorists Shot Dead In Kashmir
Related News