ఆ ఐదుగురు

Virat Kohli
  • నేటి నుంచి ఇండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ 

  • ఉదయం 5:30 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం

ఈసారి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ప్రపంచ నంబర్ వన్ జట్టు టీమిండియా గెలుస్తుందని కొంత మంది అభిమానులు, క్రికెట్ పండితులు భావిస్తున్నారు. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా గురువారం ఇండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లేని కారణంగా ఈ మ్యాచ్‌లో టీమిండియానే ఫేవరెట్ అని అందరూ అనుకుంటున్నారు. అంతేకాదు ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ లేకపోవడంతో సిరీస్‌ను గెలిచేందుకు ఇంతకంటే మంచి అవకాశం టీమిండియాకు రాదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గురువారం అడిలైడ్‌లో తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత జట్టులోని ఐదుగురు ప్లేయర్స్ ఆట తీరు ఎలా ఉందో 
ఓ లుక్కేద్దాం...

విరాట్ కోహ్లీ 
ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడమన్నా, అక్కడి సవాళ్లను ఎదుర్కోవడమన్నా టీమిండి యా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఎంత ఇష్టమో అంద రికీ తెలిసిందే. 2014లో టీమిండియా ఆస్ట్రేలి యా పర్యటనకు వెళ్లినప్పుడు ఆ నాలుగు మ్యా చ్‌ల టెస్టు సిరీస్‌లో కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అతను నాలుగు సెంచరీలతో 86.50 సగటుతో 692 పరుగులు సాధించాడు. ఓవరాల్‌గా ఆస్ట్రేలి యాలో ఆస్ట్రేలియాపై కోహ్లీ 8 టెస్టులు ఆడి ఆరోగ్యకరమైన 62.00 సగటుతో 992 పరుగులు చేశాడు. అంతేకాదు ఐదు సెంచ రీలు, రెండు అర్ధ సెంచరీలను తన పేరు మీద రాసుకున్నాడు. కింగ్ కోహ్లీ అదే అ ద్భుతమైన ఫామ్‌ను దూకుడును ఇప్పు డు కూడా ప్రదర్శించేందుకు ఎప్పుడె ప్పుడా అని ఎదురు చూస్తున్నాడు. ఈసారి ఆస్ట్రేలి యాలో టీమిండి యా టెస్టు చరిత్ర సృష్టించ డంలో కోహ్లీ కీలకపాత్ర పోషిస్తానడంలో ఎటువంటి సందేహమూ లేదు. 

రిషబ్ పంత్
ఈ యువకుడు వికెట్‌కీపర్/బ్యాట్స్‌మ న్ స్థానాన్ని భర్తీ చేశాడనడం తిరస్కరించ లేని నిజం. 2014లో టెస్టులకు ధోనీ రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత చాలా మందిని ఈ స్థానానికి ప్రయత్నించారు. కానీ ఎవ్వరూ భర్తీ చేయలేకపోయారు. వికెట్ కీపర్ ప్రతిభతో పాటు దూకుడు బ్యాటింగ్ ఈ డైనమిక్ క్రికెటర్‌కు అదనంగా మారింది. గణాంకాల ప్రకారంగా చూస్తే.. ఈ 21 ఏళ్ల పంత్ చాలా తక్కువ సమయంలో భారత జట్టులో సుస్థిర స్థానం సంపాదించాడు. ఇతను టీమిండియాకు ఆడిన 5 టెస్టుల్లో 43.25 యావరేజ్‌తో 346 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలున్నాయి. ఈ ఏడాది తొలిసారి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన పంత్ అరంగేట్ర టెస్టులో 117 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇంగ్లాండ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన పంత్ ఇప్పుడు ఆస్ట్రేలియాలోనూ అదే తరహా ఆట తీరును కనబరచాలని భావిస్తున్నాడు. ఒకవేళ అతను తన కీపింగ్, బ్యాటింగ్‌లలో సమతుల్యాన్ని సాధించగలిగితే ఆస్ట్రేలియాలో గేమ్ చేంజర్‌గా అవతరించే అవకాశముంది. 

మురళీ విజయ్
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మ్యాచ్‌లో ఈ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆస్ట్రేలియా గడ్డపై కంగారూలపై విజయ్‌కి మంచి రికార్డే ఉంది. టెస్టు సిరీస్‌కు ముందు జరిగిన నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో విజయ్ 132 బంతుల్లో 129 పరుగులు చేసి ఆస్ట్రేలియా జట్టుకు సంకేతాలు పంపాడు. ఫామ్‌లో లేని కారణంగా ఇంగ్లాండ్ పర్యటనకు దూరమైన విజయ్ 74 పరుగుల వరకు నిదానంగా ఆడాడు. ఆ తర్వాత ఒకే ఓవర్‌లో 26 పరుగులు సాధించి సెంచరీని పూర్తి చేశాడు. కాలి మడమ గాయం వల్ల యువ సంచలనం పృథ్వీ షా తొలి టెస్టుకు దూరమయ్యాడు. దీంతో కేఎల్ రాహుల్‌తో కలిసి విజయ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. 

కుల్‌దీప్
నిర్ణీత ఓవర్ల క్రికెట్‌లో అద్భుత ప్రతిభ కనబరచడం తో భారత చినమన్ బౌలర్ కుల్‌దీప్ యాదవ్‌కు టెస్టు జట్టులోనూ చోటు దక్కింది. అందులో హోం సిరీస్‌లో ఆస్ట్రేలియాపై రెండు మ్యాచ్‌లు ఆడి ఓవర్‌కు 3.60 పరుగులివ్వడమే కాకుండా 19 వికెట్లు తీశాడు. ఈ ఏడాది అక్టోబర్‌లో వెస్టిండీస్‌పై ఇన్నింగ్స్‌కు ఐదు వికెట్ల ఘనత కూడా సాధించాడు. 

షమీ
జహీర్ ఖాన్ రిటైర్మెంట్ తర్వాత టీమిండియా పేస్ అటాక్‌కు షమీ లీడర్‌గా వ్యవహరిస్తున్నాడు. వ్యక్తిగత జీ వితంలో వివాదం ఉన్నప్పటికీ 28 ఏళ్ల ఈ బౌలర్ ఈ ఏడాది ఇంగ్లాండ్ పర్యటనలో స్ఫూర్తిదాయక ప్రతిభ కనబరిచా డు. 5 టెస్టుల్లో 16 వికెట్లు తీసుకున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో నూ షమీ అటువంటి ప్రతిభే కనబరుస్తాడని టీమిండియా ఆశిస్తోంది.

సంబంధిత వార్తలు