ఆలోచించి ఓటేయండి

pavan kalyan
  • తెలంగాణ ప్రజలకు పవన్ సూచన

హైదరాబాద్: ఎక్కువ పారదర్శకత, తక్కువ అవినీతితో సుపరిపాలన అందించగలిగిన వారెవరో లోతుగా ఆలోచించి ఓటు వేయాలని తెలంగాణ ప్రజలకు జనసేనాని పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ మేరకు బుధవారం పవన్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తెలంగాణ ఇచ్చా మని ఒకరు, తెచ్చామని ఇంకొకరు, అభివృద్ధి చేశామని మరొకరు చెబుతున్న నేపథ్యంలో ఎవరికి ఓటేయాలన్న అయోమయం నెలకొందని ఆయన అభి ప్రాయపడ్డారు. ఎందరో మహనీయుల పోరాట స్ఫూర్తి నిలుపుకుని తెలంగాణ యువత స్వరాష్ట్రాన్ని సాధించిందని పవన్ ప్రశంసించారు. తెలంగాణకు బలమైన ప్రభుత్వాన్ని అందించే దిశగా సరియైన నిర్ణయం తీసుకోవాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ ఆశలు, ఆకాంక్షలు అర్థం చేసుకున్నప్పటికీ, సరైన సమయం లేకపోవడంతో ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని పునరుద్ఘాటించారు.

సంబంధిత వార్తలు