టెస్లాకు కొత్త చైర్ పర్సన్

Updated By ManamFri, 11/09/2018 - 22:33
Tesla
  • మస్క్ స్థానంలో రాబిన్ డెన్‌హాల్మ్

  • ట్విట్టర్ ప్రకటన ప్రకంపనలతో ఎలన్ మస్క్ రాజీనామా

Tesla వాహింగ్టన్: ఎలక్ట్రిక్ కార్ల తయారీలో అగ్రగామి సంస్థ టెస్లా తన కొత్త చైర్‌పర్సన్‌గా రాబిన్ డెన్‌హల్మ్(55)ను నియమించుకుంది. సంస్థ చైర్మన్ ఎలన్‌మస్క్ చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేయడంతో ఆ పదవికి ఆస్ట్రేలియాకు చెందిన అతి పెద్ద టెలికం కంపెనీ, టెల్‌స్ట్రాకు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న డెన్‌హాల్మ్‌ను నియమించారు. కాగా, తక్షణమే ఆమే చైర్మర్సన్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు   టెస్లా తెలిపింది. టెస్లాను ప్రైవేటు చేస్తానని మస్క్ చేసేందుకు వ్యూహాలు వేస్తున్నట్లు ప్రకటించిన మాస్క్ పై ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించే ప్రకటనల కింద అమెరికా మార్కెట నియంత్రన సంస్థ అభిప్రాయ పడింది. దీంతో మస్క్ ఆ పదవి నుంచి తప్పుకోక తప్పలేదు. టెస్లా డైరెక్టర్ల బోర్డులో 2014 నుంచి రాబిన్ డెన్‌హల్మ్  కూడా ఉన్నారు. కాగా, నూతన చైర్‌పర్సన్ బాధ్యతల నిర్వహనలో మస్క్ తన సహాయాన్ని అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది.   టెక్నాలజీ, వాహన రంగాల్లో ఆమెకు అపార అనుభవముందని కచ్చితంగా ఆ అనుభవం టెస్లాకు ఉపయోగపడనుందని కంపెనీ తెలిపింది.  కంపెనీలో, కంపెనీ లక్ష్యలను చేరుకోవడంలో ముందుకు సాగుతానని కంపెనీ కొత్త చైర్‌పర్సన్ రబిన్ అన్నారు. కాగా,  టెస్లా షేర్లను ఒక్కొక్కటి 420 డాలర్లకు చేసేందుకు తగిన నిధులున్నాయని ఈ ఏడాది ఆగస్టు 7న ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చేసినప్పుడు టెస్లా షేర్ 340 డాలర్ల వద్ద ఉంది. ఈ ట్వీట్‌తో అదేరోజు షేర్ ధర 380 డాలర్లపైకి చేరింది. అయితే ఇలాంటి ప్రకటనలకు ముందు నియంత్రణ సంస్థలకు సమాచారం ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ప్రకటన చేస్తే మదుపరులను తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్నరిని ఎక్స్‌చేంజ్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

Tags
English Title
Tesla is the new Chairperson
Related News