ప్రారంభమైన పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు

Polling

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు గానూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సామాన్యులతో పాటు ప్రముఖులు తమ ఓటును వేసేందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రాజమౌళి, అల్లు అర్జున్, నితిన్, నాగార్జున, అమల, నందమూరి సుహాసిని, హరీశ్ రావు తదితరులు తమ ఓటును వేశారు. ఇక తెలంగాణలో మొత్తం 119 స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. 1821మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు గురువారానికే పూర్తి కాగా.. 1.90లక్షల మంది భద్రతా బలగాలు పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నాయి. మరోవైపు ఓటు ప్రక్రియ ప్రారంభమైన కాసేపటికే పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది.

సంబంధిత వార్తలు