వెల్లడైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు

Telangana Exit Polls 2018: KCR  likely to retain
  • టీఆర్‌ఎస్ వైపే మొగ్గు చూపిన జాతీయ సంస్థల సర్వే

  • ప్రజా కూటమిది గెలుపన్న లగడపాటి సర్వే

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. ఇండియా టుడే, సీ-వోటర్ సర్వే, టైమ్స్‌నౌ, సీఎన్‌ఎక్స్, న్యూస్ 18తో పాటు పలు జాతీయ స్ధాయి సంస్ధలతో పాటు లగడపాటి రాజగోపాల్ కూడా తమ ఎగ్జిట్ పోల్‌లో తేలిన ఫలితాలను వెల్లడించాయి. జాతీయ సంస్ధల సర్వేలు టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ స్ధానాలను గెలుచుకుంటుందని పేర్కొనగా, లగడపాటి రాజగోపాల్ సర్వే మాత్రం కూటమి పక్షాలు అటూ ఇటుగా 65 స్ధానాలను గెలుచుకుంటుందని వెల్లడించారు. 

టీఆర్‌ఎస్ 35 నియోజక వర్గాల్లో గెలిచే అవకాశం ఉందన్నారు. బీజేపీ అటూ ఇటుగా 7 నియోజక వర్గాలు, టీడీపీ అటూ ఇటుగా 7 నియోజక వర్గాల్లో గెలుపొందుతుందని, స్వంతత్రుల సంఖ్య 7 నుండి 9 మధ్య ఉండే అవకాశం ఉందని లగడపాటి సర్వే తెలిపింది. వంద నియోజక వర్గాల్లో గత రెండున్నర మాసాలుగా సర్వేలు జరిపామని లగడపాటి వివరించారు. తెలంగాణ ప్రజల నాడి హస్తానికి దగ్గరగా ఉందని వెల్లడించారు. జాతీయ సర్వే సంస్ధలు మాత్రం టీఆర్‌ఎస్‌కు 66 స్ధానాలు, ప్రజా కూటమి 38 నియోజక వర్గాలకు మించి గెలిచే అవకాశం లేదని వెల్లడించాయి. ఈ ఎన్నికల్లో ప్రలోభాల ప్రభావం అధికంగానే ఉందన్నారు. 

తెలంగాణ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ను వెలువరించిన జాతీయ సంస్ధల ప్రతినిధులంతా తనకు తెలుసని లగడపాటి రాజగోపాల్ తెలిపారు. వారంతా తమిళనాడు ఎన్నికల్లో సరైన ఎగ్జిట్ పోల్స్ ఇవ్వలేక పోయారని, కర్ణాటకలో కూడా మిస్ అయ్యారని, ఏపీలో తప్పుడు ఫలితాలను వెలువరించారని వివరించారు. ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించిన సరైన ఫలితాలను వెల్లడించింది తానేనని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం, ప్రలోభాలు చాలా ఎక్కువగా ఉన్నాయని వివరించారు. 

లగడపాటి సర్వే:
కాంగ్రెస్ ప్రజా కూటమి  65
తెరాస 35 
ఎంఐఎం 7
బీజేపీ 7
స్వంతంత్రులు 7

న్యూస్ ఎక్స్ సర్వే:
టీఆర్‌ఎస్ - 57
కాంగ్రెస్ - 46
బీజేపీ - 06
ఇతరులు - 10

ఇండియా టుడే :
టీఆర్‌ఎస్ - 79 - 91
 కాంగ్రెస్ 21 - 33
 బీజేపీ 1 - 3
 ఎంఐఎం4 - 7

ఎన్‌డిటీవీ :
టీఆర్‌ఎస్ - 69
కాంగ్రెస్ కూటమి 37
బీజేపీ 4
ఇతరులు 9

టైమ్స్ నౌ :
టీఆర్ ఎస్ 66
కాంగ్రెస్ 37
బీజేపీ 7 
ఎంఐఎం 7
ఇతరులు 2

రిపబ్లిక్ టీవీ - జన్ కీ బాత్ సర్వే :
టీఆర్‌ఎస్ 50 - 65
కాంగ్రెస్ కూటమి 38 - 52
బీజేపీ 4 - 7
ఎంఐఎం 5 - 7
ఇతరులు 3 - 7

వీడీపీ:
టీఆర్‌ఎస్ 55 - 65
కాంగ్రెస్ కూటమి 34 - 44 
బీజేపీ 5 - 7
ఎంఐఎం 7 - 8
ఇతరులు 6 - 8

సంబంధిత వార్తలు