టీ20 మహిళా కెప్టెన్‌కు డిమోషన్

Updated By ManamTue, 07/10/2018 - 23:01
Harman to the Constable
  • నకిలీ డిగ్రీతో డీఎస్పీ నుంచి కానిస్టేబుల్‌కు హర్మన్ 

Harman to the Constableఅమృత్‌సర్: నకిలీ డిగ్రీ తో పంజాబ్ పోలీసు శాఖలో డీఎస్పీ ఉద్యోగాన్ని పొందిన  ఆరోపణలతో  భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ హర్మన్‌ప్రీత్ డీఎస్పీ పదవి ఊడింది. హర్మన్‌ప్రీత్ కు డిమోషన ఇచ్చి  కాస్టేబుల్ ఉద్యోగం ఇవ్వాలని పంజాబ్ పోలీసు శాఖ నిర్ణయించింది. మహిళా క్రికెటర్‌గా భారత జట్టుకు ఎనలేని సేవలు చేసినందుకు పంజాబ్ ప్రభుత్వం హర్మన్‌కు డీఎస్పీ పదవి ఇచ్చి గౌరవించింది. ఈ ఏడాది మార్చి 1న ఆమె డీఎస్పీ బాధ్యతలు కూడా చేపట్టింది. అయితే ఈ ఉద్యోగం కోసం ఆమె మీరట్‌లోని చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసినట్లు సర్టిఫికెట్లు సమర్పించింది. హర్మన్ అందించిన సరిఫికెట్ల పరిశీలన చేపట్టగా ఆ విశ్వవిద్యాలయంలో ఆమె డిగ్రీ పూర్తి చేసినట్లు ఎక్కడా వివరాలు లేదు. దీంతో హర్మన్ సమర్పించిన డిగ్రీ సర్టిఫికెట్లు నకిలీవిగా పంజాబ్ పోలీసుల దర్యాప్తులో తేలింది. 

English Title
Tea 20 women's captain is a demotion
Related News