ప్రతిభకు పట్టం 

Updated By ManamThu, 05/31/2018 - 06:35
telangana
  • 48 మంది ప్రముఖులకు అవార్డులు 

  • అవతరణ దినోత్సవం సందర్భండా ప్రకటన వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు జూన్ 2న ప్రదానం

Telanganaహైదరాబాద్: తెలంగాణ అవతరణ దినోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. హైదరాబాద్ తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల్లో ఈ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లను ఘనంగా చేస్తున్నది. హైదరాబాద్‌లోని రాజ్ భవ న్, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, చార్మినార్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు అలంకరణలు చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు అవతరణ దినోత్సవాల కోసం తమతమ పరిధిలో ఏర్పాట్లు చేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యం లో ఏర్పాటు చేస్తున్న కళారూపాలు చూపరులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏర్పాట్లతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రమంతా వెలిగిపోనుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ‘‘రాష్ట్ర స్థాయి అవార్డులు’’ ప్రదానం చే యనుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేసే 48 మందికి అవార్డులు ప్రక టించారు. అవతరణ దినోత్సవాల్లో అవార్డులతో వీరిని సత్కరించనున్నారు. అవార్డు కింద             
 వీరికి రూ. 1,00,116 ల నగదుతోపాటు  
మెమొంటో, సర్టిఫికేట్ అందజేస్తారు. 
రంగాల వారీగా అవార్డులు పొందిన వారి వివరాలు..
1. డా. నేరెళ్ల వేణుమాధవ్ ( మిమిక్రి)
2. ఆదిరాజు వెంకటేశ్వర రావు (1969 తెలంగాణ ఉద్యమం)
3. డా. రవ్వా శ్రీహరి (సాహిత్య విమర్శకులు/భాషానువాదం)సాహిత్యం
4. డా. కందుకూరి శ్రీరాములు ( కవిత్వం)
5. ఆడెపు లక్ష్మీపతి (రచనా విభాగం)
6. వసంతరావు దేశ్ పాండే (నవల)
7. ప్రొ. మహ్మద్ అలీ హసర్ (ఉర్దూ సాహిత్యం) జర్నలిజం....
8. నాగేశ్వర్ (ప్రింట్ మీడియా)
9. తిగుళ్ల కృష్ణామూర్తి (ప్రింట్ మీడియా)
10. ముకిత్ ఫారూఖీ (ఉర్దూ జర్నలిజం)
11. సూరజ్ (ఎలక్ట్రానిక్ మీడియా)
12. గుంటుపల్లి వెంకట్  ఎలక్ట్రానిక్ మీడియా)
13. గడ్డం కేశవమూర్తి (రూరల్ రిపోర్టింగ్)
14. నవీన్ (రిపోర్టింగ్)
15. నిహాల్ (సాంప్రదాయ సంగీతం)
16. పద్మజారెడ్డి (సాంప్రదాయ నృత్యం (కూచిపూడి))
17. టంగుటూరి భీమన్ పటేల్ ( పేరణి నృత్యం)
18. రవీందర్‌రెడ్డి (ఫొటోగ్రఫీ)
19. సూర్య ప్రకాశ్ (పేయింట్)
20. అంబాజీ (ఆర్ట్  అండ్ డిజైన్)
21. పురాణం రమేష్ (ఫోక్ )(కునపులి పట్నం కథ) జానపదం....
22. గిద్దె రాంనర్సయ్య (పాపులర్ ఫోక్ పాటలు)
23. మిట్లపల్లి సురేందర్ ( పాపులర్ ఫోక్ పాటలు)
ఉద్యమ గానం...
24. వరంగల్ శ్రీనివాస్ ( తెలంగాణ ఉద్యమ సమయంలో పాటలు)
25. జలజ ( తెలంగాణ ఉద్యమ సమయంలో పాటలు)
26. శంకర్ బాబు ( తెలంగాణ ఉద్యమ సమయంలో పాటలు)
27. కుమార స్వామి ( థియేటర్, మ్యాజిక్)
28. శామల వేణు ( ఫేమస్ మెజీషియన్)
29. మహ్మద్ హుస్సముద్దిన్ ( కామన్ వెల్త్ క్రీడల్లో బాక్సింగ్)
30. నేలకురి సిక్కి రెడ్డి ( ఇండియన్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు)
31. పీ.సురేష్ బాబు ( సూపరింటెండెంట్ ఇంజినీర్, ట్రాన్స్‌కో)
32. ఎల్. సంపత్ రావు ( ఎక్స్‌క్యూటివ్ ఇంజినీర్ ట్రాన్స్‌కో వరంగల్)
33. ఖాజా మోహినోద్దిన్ ( అస్టిసెంట్ ఇంజినీర్ కాలేశ్వరం ప్రాజెక్టు)
34. ఎస్. శ్రీనివాస్‌రెడ్డి ( జోనల్ కమిషనర్, జీహెచ్‌ఎంసీ)
35. డా. రవీందర్ గౌడ్ ( డాక్టర్, పేదలకు కంటి ఆపరేషన్)
36. తిరుక్కోవల్ మారుతి ( కొండగట్టు అర్చకులు)
37. బ్రహ్మ శ్రీ కాకనూరు వెంకటరమణ శాస్త్రి ( వేద పండితులు)
38. మామిడాల రాములు ( శాస్త్రవేత్త- ఏరోనాటిక్స్)
39. రామయ్య ( శాస్త్రవేత్త )
40. పీ. హనుమంతరావు ( ఎన్‌జీవో )
41. కనకయ్య జెల్లి (న్యాయవాది)
42. జగ్గన్న పేట ( ములుగు మండల్) - ఉత్తమ పంచాయతీ
43. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( ఉత్తమ మున్సిపాలిటీ)
44. యానాల లక్ష్మీ ( ఉత్తమ రైతు)
45. డీ. లింబన్న ( ప్రధానోపాధ్యాయులు జిల్లా పరిషత్ పాఠశాల)
46. రమావత్ హనుమ (  ప్రత్యేక కేటగిరీ)
47. ప్రత్యూష ( ప్రత్యేక కేటగిరీ)
48. బాలేశ్వర్ ( అనాథ పిల్లలకు సేవ చేయడం( సోషల్ వర్కర్))

Tags
English Title
Talent
Related News