‘మీరు సూపర్ మేన్...కానీ ఏం చేయరు’

Updated By ManamThu, 07/12/2018 - 15:09
anil baijal
anil baijal

న్యూఢిల్లీ : ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌‌ వైఖరిని సుప్రీంకోర్టును తప్పుబట్టింది. దేశ రాజధాని  ఢిల్లీలోని ఓఖ్లా, భాల్‌స్వా, ఘాజీపూర్‌లో చెత్త తొలగింపు విషయంలో ఎవరు బాధ్యులో చెప్పాలంటూ ఇప్పటికే ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.

దీనిపై సుప్రీంకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘మీరే చెప్పారు. నాకు అధికారం ఉంది సూపర్ మేన్‌ని అని. అయితే ఈ సమస్యను మీరు ఏమాత్రం పట్టించుకోవడం లేదు’ అంటూ న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా చెత్త విషయంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఏమాత్రం తప్పుబట్టలేమని పేర్కొంది. 

English Title
supreme court Slams Lt Governor On Delhi Garbage
Related News