స్టీరియోస్కోపిక్ 3డి చిత్రం ‘లిసా’

Updated By ManamSat, 11/10/2018 - 05:43
anjali

అంజలి ప్రధాన పాత్రలో రూ పొందిన చిత్రం ‘లిసా’. పిజి మీడియా వర్క్స్ సమర్పణలో  నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజు విశ్వనాథ్ మాట్లాడుతూ ‘‘ఒక సినిమా షూటింగ్ చెయ్యడం అంటే కష్టమైన పని. అదీ త్రీడీలో అయితే ఇంకా కష్టమైనా పని. కానీ పీజీ ముత్తయ్యగారి ఫ్రేమ్స్ మరియు ఆయన కష్టం వల్ల శరవేగంగా పూర్తయ్యింది. అంజలిగారు టైటిల్ రోల్‌కి న్యాయం చేసిందనే చెప్పాలి. ఇందులో కళ్యాణి నటరాజన్ అంజలికి తల్లిగా నటించారు’’ అన్నారు.
 

image

నిర్మాత ముత్తయ్య మాట్లాడుతూ ‘‘లిసా చిత్రానికి నేను నిర్మాణ బాధ్యతతో  పాటుగా సినిమాటోగ్రాఫర్‌గా కూడా వ్యవహరిస్తున్నాను. ఇండియాస్ ఫస్ట్ స్టీరియోస్కోపిక్ 3డీ హారర్ మూవీగా ఈ సినిమాను హీలియం 8కే కెమెరాతో చిత్రీకరించాం. ఈ సినిమాను ఈ డిసెంబర్‌లో క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని అనుకుంటున్నాం’’ అన్నారు.  అంజలి మాట్లాడుతూ ‘‘మొదటి సారి 3డీ చిత్రంలో నటిస్తున్నాను. దర్శకుడు రాజుకు స్క్రిప్ట్‌పై మంచి క్లారిటీ ఉంది. నిర్మాత మరియు సినిమాటోగ్రఫీ వర్క్‌ను ప్రెజెంట్ చేస్తున్న ముత్తయ్య తన కెమెరాతో మరింత అందంగా నన్ను చూపిం చడమే కాకుండా ఖర్చుకు ఎక్కడా వెనకాడ కుండా నిర్మించారు’’ అన్నారు. 
 

image

 

English Title
Stereoscopic 3D film 'Lisa'
Related News