వామ్మో ఎలుగుబంట్లు.. వణికిపోతున్న జనం

Updated By ManamTue, 06/12/2018 - 21:37
Srikakulam people, fear Bears attacks 

Srikakulam people, fear Bears attacks శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంట్ల దాడుల ఘటనలతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే సోంపేట, కవిటి, కంచిలి మండలాల్లో ఎలుగుబంట్లు స్వైర విహారం చేస్తూ కనిపించిన వారిపై దాడులకు పాల్పడుతూ బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో తెల్లవారుజామున పొలాలకు వెళ్లాలంటేనే అక్కడి స్థానికులు వణికిపోతున్నారు. ఇటీవల ఎర్రముక్కాం గ్రామంలో ఎలుగుబంటి ఇద్దరిపై దాడిచేసి చంపింది. మరో 10 మందిని గాయపర్చింది. గాయపడ్డ వారంతా ప్రస్తుతం సమీప ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఎలుగుబంటి దాడి చేస్తుండగా అక్కడి గ్రామస్థులు తమ మొబైల్‌లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడా ఆ వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఎలుగుబంటిపై రాళ్లు రువ్వుతూ తరిమిన ముగ్గురిపై ఎలుగుబంటి వారిపై తిరిగి దాడి చేసింది. వారిలో ఓ యువకుడి చేయిని గట్టిగా పట్టుకొని ఎలుగుబంటి దాడిచేసింది. దాంతో స్థానికులంతా కర్రలు, రాళ్లతో ఎలుగుబంటిని కొట్టి చంపేశారు. 

English Title
Srikakulam people feared by Bears attacks 
Related News