శారీ..రివర్స్!

Updated By ManamThu, 07/12/2018 - 01:23
designer

designerఆరు గజాల చీరపై ప్రయోగాలు కొత్తేం కాదు. అయినా చీరలపై ప్రయోగాలు మాత్రం నిత్యనూతనంగా కొనసాగుతూనే ఉన్నాయి.  కానీ ఒక చీరను ఒకేలా కడితే.. కొన్ని రోజుల తరువాత బోర్ కొడుతుంది. ఖరీదైన చీర అనుకొండి.. బోరుకొడితే తీసి పక్కన పెట్టలేం..అలాగని పదేపదే ఎలా కట్టగలం? అందుకే చీరలంటే ప్రాణం పెట్టే డిజైనర్ పాయల్ ఖండ్వాలా ఇందుకు ఓ విరుగుడు కనిపెట్టారు. ఒక చీరను రెండు రకాలుగా ధరించవచ్చు..దీంతో ఆ మోనోటనీ పోతుంది. పైపెచ్చు న్యూ లుక్ వస్తుంది. ఇందుకు ప్రత్యేకంగా ఖర్చు అయ్యేదేం లేదు కానీ రివర్సిబుల్ సారీస్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ..అంతే సింపుల్!


రెండు కొంగులు
గతంలో చీరను ఉల్టా అయినా కట్టొచ్చు, సీదా అయినా కట్టచ్చు.. ‘టూ ఇన్ వన్’లా రెండు వేర్వేరు రంగులు, డిజైన్లలో వచ్చేవి.. దానికి భిన్నంగా ఈ చీరలు ఉంటాయి. అంటే రెండు పల్లూలు, రెండు బాడీలుంటాయన్నమాట. బ్లౌజ్‌తో ఎన్నైనా ప్రయోగాలు చేయచ్చు కనుక ఆపోజిట్, మ్యాచింగ్, మిక్స్డ్ బ్లౌజులతో ఈ చీరను ఆకట్టుకునేలా ధరించవచ్చు. ఒక చీరకు రెండు కొంగులున్న కారణంతో అందునా కాంట్రాస్ట్ కాంబినేషన్స్ ఉన్నందున ఈ శారీ చాలా స్పెషల్‌గా కనిపిస్తుంది. ఇందుకు తగ్గట్టుగా మీరు యాక్సెసరీస్ ధరిస్తే ఎథ్నిక్ లుక్‌తో పాటు ఫ్యాషన్ ఈస్తెటిక్స్ ఉట్టిపడేలా కనిపించడం ఖాయం. ఇది ఎంత మాడ్రన్ ఐడియా అయినా వచ్చే లుక్ మాత్రం క్లాసిక్‌గా ఉంటుందన్న విషయం మరిచిపోకండి. ముఖ్యంగా ఫొటో సెషన్స్‌కు ఇలాంటివి అదిరిపోయేలా ఉంటాయి.  కిట్టీ పార్టీలు, గెట్‌టుగెదర్‌లు, పెళ్లిళ్లు, పేరంటాలు  అకేషన్ ఏదైనా అందుకు అతికినట్టు సరిపోయే ఇలాంటి ట్రెండీ చీరలు మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిందే. మీరు ఫ్యాషన్ ప్రియులైతే ఇలాంటి ప్రయోగాలు ఎంజాయ్ చేసితీరాలని శారీ ప్రియులైన సెలబ్రిటీలు టిప్స్ ఇస్తున్నారు.  పట్టు మొదలు కాటన్, షిఫాన్, జార్జిట్, ప్రింట్స్, వర్క్ ఇలా ఒక్కటేమిటి మీ టేస్ట్‌కు తగ్గ స్టైల్స్‌లో, ధరల్లో ఈ రివర్సిబల్ చీరలు మార్కెట్లో ఊరిస్తున్నాయి.  

English Title
Saree.. reverse!
Related News