నేను సిన్సియర్ లవర్‌ని

Updated By ManamTue, 08/21/2018 - 01:20
darshana banic

imageనారా రోహిత్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆటగాళ్ళు’. ఈ నెల 24న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ దర్శన బానిక్ మాట్లాడుతూ ‘‘నేను కోల్‌కతా నుంచి వచ్చాను. మోడల్‌గా చేశాను, బెంగాలీలో ఆరు సినిమాలు, ఓ వెబ్ సిరీస్‌లో నటించాను. తెలుగులో ఇదే మొదటి సినిమా. అయితే తెలుగు సినిమాలు బెంగాలీలోకి డబ్ అవుతాయి. అలా తెలుగు సినిమాలు చూడటం జరిగింది. ముఖ్యంగా మగధీర, ఆర్య, ధృవ, అరుధంతి, బాహుబలి సిరీస్ ఇలా అన్నీ చూసాను. నాకు ‘బాహుబలి’ చాలా బాగా నచ్చింది. ఈ సినిమా విషయానికి వస్తే  ఆడిషన్స్ ఆరు రౌండ్స్ జరిగాయి. ఈ పాత్రకు నేను సరిపోతానని నన్ను సెలెక్ట్ చేశారు.

ఇందులో నా పాత్ర పేరు అంజలి. చాలా ఇండిపెండెంట్‌గా ఉండే వర్కింగ్ లేడి. హీరో పాత్రను సిన్సియర్‌గా లవ్ చేస్తోంది. అతన్నే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ చిత్రంలోని అంజలి ఓ సిన్సియర్ ప్రేమికురాలు. ఈ సినిమాలో నారా రోహిత్, జగపతిబాబు పాత్రలు హైలైట్‌గా ఉంటాయి. ఇద్దరూ పోటీపడి మరీ నటించారు. షూటింగ్ టైమ్‌లో వారిద్దరి సహకారం మర్చిపోలేను. నేను తెలుగు అర్థం చేసుకోగలను. కానీ, మాట్లాడలేను. నెక్స్‌ట్ టైమ్ ఖచ్చితంగా తెలుగులో మాట్లాడతాను. నాకు ఇష్టమైన హీరోలు బాలీవుడ్‌లో షారుక్ ఖాన్. తెలుగులో ప్రభాస్. ‘బాహుబలి’ చూసి ఆయనకు పెద్ద ఫాన్ అయిపోయాను. అలాగే అల్లు అర్జున్ కూడా నాకు ఇష్టమైన హీరో. నాకు ఇష్టమైన డైరెక్టర్ రాజమౌళి’’ అని అన్నారు.

English Title
sincere lover
Related News