హలో సగా అంటున్న శ్రుతి

Updated By ManamTue, 10/23/2018 - 06:25
shruthi hasan

సంగీత దర్శకురాలిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రుతిహాసన్ తర్వాత హీరోయిన్‌గా మారి బాలీవుడ్, దక్షిణాదిన స్టార్ హీరోయిన్‌గా రాణించింది. అయితే ఈ మధ్య కాలంలో ఈమె ఎందుకనో సినిమా రంగానికి చాలా దూరంగా ఉంటున్నారు. ‘శభాష్ నాయుడు’ సినిమా ఆగిపోయిన తర్వాత కొన్ని రోజులకు ప్రియుడు మైకేల్‌ను పెళ్లి చేసుకుంటుందని .. అందుకనే సినిమాలేవీ ఒప్పుకోవడం లేదని వార్తలు వినిపించాయి కూడా. అయితే అలాంటిదేమీ లేదని.. వాంటెడ్‌గానే గ్యాప్ తీసుకున్నానని శ్రుతి హాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

image


ప్రస్తుతం మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తుందంతే. అయితే త్వరలోనే శ్రుతి త్వరలోనే బుల్లి తెరపై సందడి చేయనుంది. ఇప్పుడు హీరోలు సినిమాలతో పాటు టీవీ ప్రోగ్రామ్స్‌పై కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కోలీవుడ్‌ను గమనిస్తే రీసెంట్ టైమ్స్‌లో విశాల్, వరలక్ష్మి శరత్‌కుమార్ బుల్లి తెరపై స్పెషల్ ప్రోగ్రామ్స్‌తో సందడి చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు శ్రుతి హాసన్ కూడా వీరి లిస్టులో చేరింది. సన్ టీవీలో ‘హలో సగా!’ అనే ప్రోగ్రామ్‌ను శ్రుతి హాసన్ హోస్ట్ చేయనుంది. 

English Title
shruthi hasan as host to a hello saga programe
Related News