హైదరాబాద్ చేరుకున్న శరత్ మృతదేహం

Updated By ManamThu, 07/12/2018 - 08:18
sarat-dead-body-reaches-hyderabad

sarat-dead-body-reaches-hyderabad

హైదరాబాద్: అవెురికాలోని కన్సాస్‌లో జరిగిన కాల్పుల ఘటనలో మరణించిన వరంగల్ వాసి కొప్పుల శరత్ మృతదేహం గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకుంది. ఎయిర్ ఇండియా విమానంలో నేరుగా హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి తరలించడం జరిగింది. 

మృతదేహనికి కేంద్ర మాజీ మంత్రి ఎంపీ బండారు దత్తాత్రేయ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు పట్నం నరేందర్ రెడ్డి, శంభిపురి రాజు, సైబరాబాద్ సీపీ సజ్జనార్ నివాళులు అర్పించారు. శరత్‌ను కడసారి చూసేందుకు ఆయన మిత్రులు, సన్నిహితులు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. శరత్ కుటుంబీకులు ఆర్తనాదాలు మిన్నంటాయి. గురువారం సాయంత్రం అంత్యక్రియలు జరిగే అవకాశముంది. కాగా.. అవెురికాలోని మిస్సోరి వర్సిటీలో ఎంఎస్ చదువుతూ అక్కడి రెస్టారెంట్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్న శరత్ కొప్పు ఓ దొంగ జరిపిన కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే. 

ఇదిలా ఉంటే.. శరత్ మృతదేహం గురువారం రానున్నట్లు ఎంపీ బండారు దత్తాత్రేయ మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. హంతకున్ని త్వరలో పట్టుకునేందుకు అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నామని.. ఈ విషయాలన్నీ కేంద్ర మంత్రి సుష్మస్వరాజ్‌తో మాట్లాడామని దత్తన్న బుధవారం నాడు మీడియాకు వివరించారు.  అమెరికా‌లో మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సుష్మను కోరినట్లు ఆయన చెప్పారు.

English Title
sarat-dead-body-reaches-hyderabad
Related News