శాంసంగ్ గెలాక్సీ జె8 వచ్చేస్తోంది..!

Updated By ManamTue, 06/26/2018 - 10:53
Samsung Galaxy J8, India starting June 28, Galaxy J8
  • జూన్ 28 నుంచి భారత మార్కెట్లలో అందుబాటులోకి 

  • పేటీఎం మాల్‌లో అమ్మకానికి జె సిరీస్ స్మార్ట్ ఫోన్లు

  • ఐసీఐసీఐ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కస్టమర్లకు క్యాష్ బ్యాక్ ఆపర్లు 

Samsung Galaxy J8, India starting June 28, Galaxy J8ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ త్వరలో గెలాక్సీ జె8 మోడల్స్‌ను భారత్ మార్కెట్లలోకి ప్రవేశపెట్టనుంది.  ఈ ఏడాది మేలో శాంసంగ్ గెలాక్సీ జె6, ఏ6, ఏ6 ప్లస్ మోడల్స్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శాంసంగ్ సంస్థ కొత్త మోడల్ ‘శాంసంగ్ గెలాక్సీ జె8‌’ను జూలై నుంచి భారత్ మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. కానీ, ఏ తేదీ నుంచి విడుదల చేసేది మాత్రం అప్పుడు శాంసంగ్ సంస్థ బహిర్గతం చేయలేదు. తాజాగా సంస్థ శాంసంగ్ గెలాక్సీ జె8 మోడల్స్‌ జూన్ 28 నుంచి భారత మార్కెట్లలోకి వస్తాయని సోమవారం స్పష్టం చేసింది. ఈ మేరకు శాంసంగ్ మొబైల్ ఇండియా ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది. ‘‘భారత్‌లో భారీ లాంచింగ్‌కు మరో మూడు రోజులు మాత్రమే. అప్పటివరకూ వేచి ఉండండి. శాంసంగ్ గెలాక్సీ జె8 మోడల్‌ను తొలిసారి భారత్ మార్కెట్లో ప్రవేశపెట్టబోతున్నాం’’ అని సంస్థ ట్వీట్‌లో పేర్కొంది. 

మూడు రంగుల్లో గెలాక్సీ జె8..
శాంసంగ్ గెలాక్సీ జె8 బ్లూ, బ్లాక్, గోల్డ్ మూడు రంగుల్లో లభ్యంకానున్నాయి. కంపెనీ ఈ-షాప్ వెబ్‌సైట్‌లో అమ్మకానికి ఉంచగా, దీని ధర ఎంత అంటే రూ. 18,990. పేటీఎం‌ మాల్‌లో కూడా ఈ (జె-సిరీస్) స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉంటాయి. ఐసీఐసీఐ బ్యాంకు భాగస్వామ్యంతో కస్టమర్లకు క్యాష్ బ్యాక్ ఆపర్లను కూడా అందిస్తోంది. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా జె8 స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసిన ఐసీఐసీఐ వినియోగదారులకు రూ. 1,500 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ జె8 ఫీచర్లు.. 
శాంసంగ్ గెలాక్సీ జె8 ఒక వేరియంట్‌తో మాత్రమే భారత మార్కెట్లలో లభ్యం కానుంది. అందులో 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ ఉండగా, మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు స్టోరేజ్‌ను విస్తరించవచ్చు. జె8 స్మార్ట్‌ఫోన్ 6 అంగుళాల పరిమాణంతో 720 పీక్సల్స్ సైజు, సూపర్ ఏఎంఓ ఎల్‌ఈడీ డిసిప్లే ఉంటుంది. క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 450 ప్రాసిసర్‌ సామర్థ్యంతో పనిచేస్తుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో ఆండ్రాయిడ్ ఓరియో సాఫ్ట్‌వేర్‌తో పనిచేసే ఈ జె8లో 4జీ ఎల్‌టీఈ కనెక్ట్‌విటీతో సపోర్ట్ చేస్తుంది. 3,500 ఎంఎహెచ్, మైక్రో యూఎస్‌బీ చార్జర్‌ అదనంగా లభిస్తుంది. గెలాక్సీ జె8లో డ్యుయల్ రియర్ కెమెరా‌తో పాటు 16 మెగాఫిక్సల్ (ఎల్ఈడీ ప్లాష్) ప్రైమరీ కెమెరా (ఎఫ్/1.7) సెన్సార్ ఉంటుంది. 5-మెగా ఫిక్సల్ సెకండరీ కెమెరా (ఎఫ్/1.9)తో సెన్సార్ ఉంటుంది. 

English Title
Samsung Galaxy J8 will be available in India starting June 28 for Rs 18,990
Related News