శాంసంగ్ మడతబెట్టే ఫోన్ ఫస్ట్ లుక్ విడుదల

Updated By ManamFri, 11/09/2018 - 22:33
Samsung Folding Phone

Samsung Folding Phoneశాన్‌ఫ్రాన్సిస్కో: సౌత్ కొరియన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ ఎప్పటినుంచో  ఎదురు చూస్తున్న మడతబెట్టే ఫోన్‌ను ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఇటీవల శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రదర్శించింది. దీనికోసం యాప్‌లను  సిద్ధం  చేయాల్సిందిగా ఆండ్రాయిడ్ డెవలపర్లను శాంసంగ్ కోరింది. అయితే ఇప్పటి వరకూ మడతబెట్టే ఫోన్ డిజైన అవుట్ లుక్ మాత్రమే కంపెనీ వెల్లడించింది. ఎప్పుడు రిలీజ్ అవ్వనుంది, ధర వంటి విషయాలు వెల్లడించలేదు. శాంసంగ్  కంపెనీ అమెరికా మొబైల్ ఉత్పత్తుల వ్యూహాత్మకండ్ మార్కెటింగ్  సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జస్టిన్ డెనిసన్ ఈ మడత బెట్టె ఫోన్‌ను ప్రదర్శించారు. దీని ద్వారా ఈ ఫోన్ 7.3 అంగుళాలు స్క్రీన్‌తోతో ఉండన్నుట్లు స్పష్టమైంది. ఇప్పటికే ఎల్‌జీ, హువావే వంటి కంపెనీలు కూడా మడత బెట్టే ఫోన్లను మార్కెట్లో ప్రవేశ పెట్లనున్నట్లు ప్రకటించింన విషయం తెలిసిందే. అయితే వాటి వివరాలు ఇంతవరకు వెల్లడికాలేదు. కానీ చైనాకు చెందిన రాయోలే సంస్థ మాత్రం ప్రపంచంలోనే మొట్టమొదటి మడత బెట్టే స్మార్ట్ ఫోన్‌ను ఆవిష్కరించి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా పేరున్న శాంసంగ్ కంపెనీ మడతబెట్టే ఫోన్‌ను తీసుకువస్తుందన్న వార్తలతో కొత్త ఆసక్తి నెలకొంది.

English Title
Samsung Folding Phone First Look Released
Related News