తగ్గిన హెచ్1బీ వీసాల జారీ!

Updated By ManamFri, 11/09/2018 - 23:39
visa

visaవాషింగ్టన్: విదేశీ నిపుణుల రాకను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాటలో ఆయన యంత్రాంగం నడుచుకుంటోంది. ట్రంప్ వచ్చిన తర్వాత నిపుణులకు ఆయా కంపెనీలు మంజూరు చేసే హెచ్-1బీ వీసాల జారీ నిలుపుదల అమాంతం పెరిగిపోయింది. ఈ విషయాన్ని గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలతో అనుబంధమున్న ‘కంపీట్’ అనే సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) దాని సొంత నిబంధనలను ఉల్లంఘిస్తోందని కంపీట్ అమెరికా ఆరోపించింది. హెచ్-1బీ వీసా దరఖాస్తులు అధిక సంఖ్యలో యూఎస్‌సీఐఎస్ వద్ద అట్టిపెట్టుకుంటోందని ఫిర్యాదు చేసింది.హెచ్-1బీ వీసా ద్వారా విదేశీయులు అమెరికాలోని కంపెనీల్లో ఉద్యోగం చేయొచ్చు. ఎన్నో ఐటీ కంపెనీలు ఈ వీసాల మీద ఆధారపడి వేలాది మంది విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ప్రతి ఏడాది భారత్, చైనాల నుంచి చాలా మంది ఈ వీసాల ఆధారంగా అమెరికా కంపెనీల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. అయితే ట్రంప్ యంత్రాగం ఆధ్వర్యంలో హెచ్-1బీ వీసాల న్యాయ విచారణ పద్ధతుల్లో మార్పులు గమనించామని కంపీట్ అమెరికా పేర్కొంది. న్యాయపరమైన నిబంధనలలో చాలా అసమానతలు ఉన్నాయని సెక్రటరీ ఆఫ్ ెంల్యాండ్ సెక్రటరీ, యూఎస్‌సీఐఎస్‌లకు కంపీట్ అమెరికా లేఖ ద్వారా వెల్లడించింది. 18 నెలల్లో కంపెనీలకు రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్‌లు, దరఖాస్తుల తిరస్కరణలు పెరిగిపోయాయని వెల్లడించింది.

Tags
English Title
Reduced H1B visas issued
Related News