బోయపాటి భారీతనానికి చెర్రీ బ్రేక్..?

Updated By ManamWed, 07/11/2018 - 14:54
cherry

cherry ‘రంగస్థలం’తో పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న రామ్ చరణ్ తన తదుపరి చిత్రంపై చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నాడు. స్క్రిప్ట్ మాత్రమే కాదు బడ్జెట్ విషయంలోనూ చెర్రీ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మామూలుగా బోయపాటి అంటే భారీతనం ఉండనుండగా.. ఈ చిత్రం కోసం మాత్రం వీలైనంత తగ్గేలా చెర్రీ ప్లాన్ చేస్తున్నాడట.

ఈ క్రమంలో ముందు అనుకున్న బడ్జెట్ కంటే 10కోట్లు తక్కువకే చిత్రీకరణ పూర్తి చేయాలని బోయపాటికి చెర్రీ చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు మార్కెట్ ఉంది కదా అని ఖర్చు చేయించొద్దని, నిర్మాతకు లాభాలు రావాలని చెప్పడమే కాకుండా, ఎప్పటికప్పుడు ఖర్చు గురించి వివరాలను చెర్రీ తెలుసుకుంటున్నట్లు సమాచారం. దీంతో బోయపాటి కూడా తన భారీతనానికి కాస్త బ్రేక్ వేసినట్లు టాక్. ఎంతైనా చెర్రీ కూడా నిర్మాతగా మారాడు కదా.. అందుకే వారి కష్టాల గురించి తెలిసే బడ్జెట్ విషయంలో ఇలా లెక్కలేస్తున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.

English Title
Ram Charan class to Boyapati..?
Related News