ఏపీకి వర్షసూచన

Updated By ManamWed, 06/13/2018 - 00:56
rain
  • వచ్చే రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు  

imageహైదరాబాద్: వచ్చే రెండు రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు చెప్పారు. అలాగే ఒడిశా నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని వెల్లడించారు. తెలంగాణలోనూ రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. మంగళవారం కోస్తాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. అలాగే తెలంగాణలో పలు చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి.

English Title
Rainfall to AP
Related News