పోర్టులతోనే పురోగతి

Updated By ManamFri, 07/13/2018 - 00:26
gadkari
  • ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకోవాలి.. జల రవాణా ప్రగతికి కేంద్రం సుముఖం

  • ఉపరితల రవాణాలో అగ్రగామి కావాలి.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

gadkariవిశాఖపట్నం: భారీ ఎగుమతులే లక్ష్యంగా పోర్టు చైర్మన్‌లు పని చేయాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారు. జాతీయ మేజర్ పోర్టుల అభివృద్ధి అంశంపై గురువారం విశాఖలో నిర్వహించిన సమీక్షలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలను అధిగమించేందుకు ప్రయత్నించాలని అధికారులను సూచించారు. జల రవాణాను అభివృద్ధి చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉందన్నారు. సాగరమాల ప్రాజెక్టు ఏర్పాటుతో సరుకు రవాణా మరింత పెంచేందుకు వీలు కలుగుతుందన్నారు. అందుకు అందరూ సహకరించాలని కోరారు. భవిష్యత్తులో విదేశీ మాదక ద్రవ్యాన్ని పెద్ద ఎత్తున ఆర్జించేందుకు జల రవాణా ఒక్కటే ప్రధాన మార్గమన్నారు. పోర్టులకు ఇచ్చిన లక్ష్యాలను చేరుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. పోర్టు విస్తరణకు అవసరమైన అనుకూల నిర్ణయాలు తీసుకోవడంలో కేంద్రం ముందుందన్నారు. భవిష్యత్తులో జల రవాణాకు డిమాండ్ పెరగనుందని, అవసరమైన వనరులు సమకూర్చుకోవాల్సిన బాధ్యత పోర్టులపై ఉందన్నారు. లక్ష్యాలను చేరుకోవడంలో  విశాఖ పోర్టుతో పాటు పలు పోర్టులు ముందున్నాయని ప్రశంసించారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ఎగుమతులను పెంచాల్సి అవసరం వుందన్నారు. ప్రపంచంతో పోలిస్తే అగ్ర దేశాలతో సమానంగా భారత్ పోటీ పడుతుందన్నారు. విదేశీ దిగుమతులను తగ్గించుకుని దేశీయ ఎగుమతులను పెంచుకునేందుకు ప్రయత్నించాలన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రులు రాధాకృష్ణన్, మన్షుక్ మాండవ్య, వివిధ పోర్టుల చైర్మన్‌లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఆర్కే బీచ్‌లో స్వచ్ఛభారత్..
మేజర్ పోర్టుల అభివృద్ధి సమీక్షా సమావేశంలో పాల్గొనేందుకు విశాఖకు వచ్చిన కేంద్ర మంత్రులు రాధాకృష్ణన్, మన్షుక్ మాండవ్య స్థానిక ఆర్కే బీచ్‌లో నిర్వహించిన స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్నారు. బీచ్ క్లీనింగ్ పనుల్లో పాలుపంచుకున్నారు. కార్యక్రమంలో మంత్రులతో పాటు పలువురు పోర్టు చైర్మన్‌లు, ఎంపీ హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags
English Title
Progress with ports
Related News