వయోవృద్దుల సంరక్షణకు సన్నద్ధం

Updated By ManamMon, 10/01/2018 - 02:32
 Age nectar

imageవయోవృద్ధుల సంరక్షణ చట్టం ఉన్నట్లు చాలామందికి తెలియదు. వయోవృద్ధులను పట్టించుకోని పిల్లలను చట్టం శిక్షిస్తుంది. జిల్లాలో కలెక్టర్ అప్పిలేట్ ట్రిబ్యునల్ అధికారిగా ఉంటారు. రెవెన్యూ డివిజనల్ స్ధాయిలో ఆర్.డి.ఓ. ట్రిబ్యునల్ అధికారిగా ఉంటారు. ఎవరైనా వృద్ధులు తమ పిల్లలు తమను పట్టించుకోవడం లేదని, పొషించడం లేదని ఈ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేస్తే 90 రోజుల్లో పరిష్కరిం చాలని చట్టం చెబుతోంది. దీనికి లాయర్ వచ్చి వాదించకూడదని అ చట్టంలో పొందుపరిచారు. ఈ చట్టంపై ప్రతిపల్లెలో మండలాల్లో జిల్లా కేంద్రలలో అవగాహన సమావేశాలు, చర్చా కార్యక్రమాలు ప్రభు త్వపరంగా చేపట్టాలి. వార్తా పత్రికలలో వ్యాసాలు ప్రచురిస్తూ, టివి చానళ్లలో విరివిగా ఈ చట్టంపై ప్రచారం చేయాలి. వయోధికులపై జరుగుచున్ను వేధింపుల తీవ్రతను గుర్తించిన ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల సర్వ సభ్య సమావేశం నిర్వహించి  వయోధికులపై జరుగుతున్న వేధింపులను ఖండిస్తూ వయోవృ ద్ధుల సంరక్షణకు,వాటి చట్టాలపై సమాజంలో అవగాహన కల్పించాలని అన్ని సభ్యదేశాలు సంవత్సరంలో అక్టోబర్ 1ని ప్రపంచ వయోవృద్ధుల దినో త్సవం జరపాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. వయోవృద్ధులకు సేవ చేస్తున్న స్వచంద సంస్థలు, సీని యర్ సిటిజన్స్ అసోసియేషన్ వ్యక్తులను సన్మానించాలని, వయోవృద్ధుల సంరక్షణ చట్టంపై అవగాహన నిర్వ హించాలని సూచించింది.  మానసికంగా, శారీర కంగా, ఆర్థికంగా, సామాజిక పరంగా బాధలకు గురి చేయడం వల్ల వయోధికులు, శారీరకంగా బలహీనపడి మనోస్త్థెర్యం కోల్పోతున్నారు. అందుకే  వారు వేధింపుల ను గట్టిగా వ్యతిరేకంచ లేకపోతున్నారు. అన్ని వర్గాల వయోధికులు వేధింపులకు గురవుతున్న సంఘట నలు చూస్తున్నాము. వయోధికులు వేధింపులను ప్రధానంగా తమ పిల్లలు, బంధువుల నుండి ఎదుర్కొంటున్నారు. వేధింపులకు గురైన వ్యక్తులు మానసికంగా, శారీరకంగా కుంగి శుష్కించి తమ జీవితాలను ముగించే స్థితికి చేరుకుంటు న్నారు. జీవిత కాలంలో ఉన్నతంగా, గౌరవప్రదంగా బతికి పిల్లల లు, బంధువుల చీత్కారాలను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్ప డుతున్నారు. వయోధికులు అనారోగ్యానికి గురైనప్పడు వారికి సేవలు అందించలేక వారి జీవితాన్ని ముగింపజేసిన సందర్భాలు ఎన్నో పత్రికలలో ప్రసార మాధ్యమాలలో చూస్తున్నాము. మరి కొంతమంది వయోధికులు ఆస్తులను అమాయకంగా పిల్లలకు, బంధువులకు ఇచ్చేసి  మోసపోతున్నారు.

    వయోధికులకు ప్రశాంతంగా జీవించే వాతావర ణాన్ని కల్పించాలి. వేధింపుల పట్ల వయోధి కులకు, పిల్లలకు పూర్తి అవగాహన క ల్పించాలి, సమాజంలో ఈ వేధిం పులపై చర్చను లేవదీసి నివారించే ప్రయత్నాలు చేపట్టాలి.  అన్నివర్గాల వృద్ధులను గౌర వించటం, ప్రత్యేకంగా  తల్లి దండ్రులైన వృద్ధులను   బా ద్యతతో సంరక్షించాలి. త ద్వారా  వయోధికుల పట్ల సానుభూతి, సద్భావన పెంపొందుతాయి. వయో ధికులు తమ అభివృద్ధికి కారకులు, వారిని గౌరవ ప్రదంగా చూడడం మన క నీస భాధ్యత. యువతలో మార్పు తీసుకురావాలి. 

    మన దేశంలో 80% పైగా వయోధికులకు తమ సంరక్షణ కొరకు చట్టాలున్నాయి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలి యదు. ఇందుకు నిరక్షరాస్వత. అందుకే ప్రస్తుతమున్న చట్టాల పట్ల వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం  2007, సంక్షేమ నియమా వళి 2011 గూర్చి వయోధికులకు అవగాహన కల్పించాలి. టివి చానళ్లలో చర్చలు చేపట్టాలి. వయోవృద్ధుల సంరక్షణ చట్టం ఉన్నట్లు చాలామందికి తెలియదు. వయోవృద్ధులను పట్టించుకోని పిల్లలను చట్టం శిక్షిస్తుంది. జిల్లాలో కలెక్టర్ అప్పిలేట్ ట్రిబ్యునల్ అధికారిగా ఉంటారు. రెవెన్యూ డివిజనల్ స్ధాయిలో ఆర్.డి.ఓ. ట్రిబ్యునల్ అధికారిగా ఉంటారు. ఎవరైనా వృద్ధులు తమ పిల్లలు తమను పట్టించుకోవడం లేదని, పొషించడం లేదని ఈ ట్రిబ్యు నల్‌కు ఫిర్యాదు చేస్తే 90 రోజుల్లో అ సమస్యలు పరిష్కరించాలని చట్టం చెబుతోంది. దీనికి లాయర్ వచ్చి వాదించకూడదని అ చట్టంలో పొందుపరిచారు. ఈ చట్టంపై ప్రతిపల్లెలో మండలాల్లో జిల్లా కేంద్రలలో అవగాహన సమావేశాలు, చర్చా కార్యక్రమాలు ప్రభుత్వపరంగా చేపట్టాలి. వార్త పత్రికలలో వ్యాసాలు ప్రచురిస్తూ, టివి చానళ్లలో విరివిగా ఈ చట్టంపై ప్రచారం చేయాలి. సీనియర్ సిటిజన్‌ల సంఘాలు, స్వచ్చంద సంస్ధలు, రాజకీయ పార్టీలు, పత్రికలు, జిల్లా కలెక్టర్ ఆర్‌డి.ఓ., పోలీస్ అధికారులు, తమవంతు పాత్రను పొషిస్తూ వయోవృద్ధులకు సరైన న్యాయం జరిగేట్లు చూడాలి.

పిల్లలు కూడా తమను కనిపెంచిన వృద్ధ తల్లిదండ్రులు గురువుకన్నా, భగవంతుని కన్నా మిన్న అనే సత్యాన్ని గ్రహించాలి. తెలంగాణ ప్రభుత్వం సి.ఎం. కేసిఅర్ అదేశాలతో  అక్టోబర్ 1ని ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. వయోవృద్ధుల సంరక్షణ చట్టం గురించి అవ గాహన సదస్సులు నిర్వహించాలని రాజాధానిలో, అన్ని జిల్లాలలో, డివిజన్‌లలో మండలాల్లో నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వ వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ  శాఖ నిర్ణయించింది. ఈ మేరకు వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఎం.డీ. బి.శైలజ ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణ అల్ సీనియర్ సీటిజన్స్ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు పి.నర్సిం హారావు అధ్వర్యంలో తెలంగాణలోని 31 జిల్లాల్లో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం జరపడానికి సీనియర్ సిటిజన్ సంఘాలు నిర్ణయించాయి. సి.ఎం. కేసీఆర్ చొరవతో తెలంగాణ ప్రభుత్వం 2016 సంవత్సరంలో వయోవృద్ధుల సంక్షేమం సమస్యల పరిష్కరానికి  వయోవృద్ధుల సంక్షేమ మండలి, కౌన్సిల్ మెంబర్లను ఏర్పాటు చేయడం వయోవృద్ధులకు ఊతమిచ్చింది.
 హరి అశోక్ కుమార్ 
తెలంగాణ అల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్
9440463498
(నేడు ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం)

Tags
English Title
Preparing for the protection of the ecosystems
Related News