బియ్యం కాదు...భవిష్యత్ కావాలి..

Updated By ManamThu, 10/18/2018 - 19:05
pawan kalyan slams ap govenrment
pawan kalyan

విశాఖ : తుపాను కారణంగా సర్వం కోల్పోయిన బాధితులకు పాతిక కిలోల బియ్యం కాదని...పాతికేళ్ల భవిష్యత్ అందించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. తుత్లీ తుపానుతో నష్టపోయిన శ్రీకాకుళం జిల్లా ఇంకా తేరుకోలేదన్నారు. ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ... శ్రీకాకుళంలో విద్యుత్, మంచినీరు ఇచ్చామని ప్రచారం చేస్తున్నారని,  కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉందని అన్నారు. 

అధికార పార్టీ నేతలు ఎవరూ గ్రామాలకు రాకపోయినా తాను పర్యటించానని అన్నారు. ఉద్దానంలో ఇంకా కరెంట్ రాలేదు. కావాలంటే అధికారులను పంపలని సవాల్ చేశారు. ఉద్దానం కిడ్నీ సమస్యను ప్రపంచం దృష్టికి ఎలా తీసుకు వెళ్లానో... తుపాను నష్టాన్ని కూడా అదేవిధంగా తెలియచేస్తానని తెలిపారు.

తుపాను బాధితుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కేరళలో వరదలు వస్తే అందరూ పర్యటించారని, అదే శ్రీకాకుళానికి తుఫాను వస్తే ఎవరూ పరామర్శించడానికి రాకపోవడం బాధాకరంగా ఉందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తుపాన్ నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళతానని ఆయన అన్నారు. 

English Title
Pawan kalyan lashes out at ap govt over people suffering Titli Cyclone
Related News