ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో జోరు

Updated By ManamTue, 06/12/2018 - 22:50
cars

carsన్యూఢిల్లీ:  ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు మే నెలలో మంచి వృద్ధిని సాధించినట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియాం) తెలిపింది. ఈ ఏడాది ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 19.65 శాతం పెరిగాయి. గతేడాది మేలో వీటి అమ్మకాలు 2.51,764 యూనిట్లుగా ఉంటే 2018 మేలో 3,01,238 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయని ‘సియాం’ పేర్కొంది. ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా క్రిందటేడాది మే కంటే 2018 మేలో 15 శాతం  పెరిగినట్లు ‘సియాం’ వెల్లడించింది. ఈ ఏడాది మేలో ద్విచక్ర వాహనాలు 12,21,559 యూనిట్లు విక్రయవువగా, 2017 మే నెలలో 10,60,744 యూనిట్ల అమ్మకమయ్యాయి. అన్ని కేటగిరీలకు చెందిన వాహనాల విక్రయాలు గతేడాది మేతో పోల్చుకుంటే  12.13 శాతం పెరిగినట్లు ‘సియాం’ తెలిపింది. దేశవ్యాప్తంగా 2017 మేలో వాహనాల అమ్మకాలు 20.35.610 యూనిట్లు కాగా 2018 మేలో 22,82,618 యూనిట్ల అమ్మకాలు నమోదైనట్లు ‘సియాం’ వెల్లడించింది.

Tags
English Title
Passenger vehicles will be sold in sales
Related News