దినకరన్ ఎమ్మెల్యేలకు చుక్కెదురు!

Updated By ManamThu, 06/14/2018 - 14:58
Palaniswami government gets breather, Madras HC gives split verdict on disqualification of 18 AIADMK MLAs
  • తాత్కాలికంగా ఊపిరి పీల్చుకున్న పళని వర్గం

Palaniswami government gets breather, Madras HC gives split verdict on disqualification of 18 AIADMK MLAsచెన్నై: ఈపీఎస్-ఓపీఎస్ వర్గానికి తాత్కాలిక ఊరట లభించింది. దినకనర్‌ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసులో ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలపై అనర్హత నిర్ణయాన్ని  జస్టిస్‌ ఇంద్రాణి బెనర్జీ సమర్థించగా,  స్పీకర్‌ నిర్ణయం చెల్లబోదని జస్టిస్‌ సెల్వం వేరుగా తీర్పునిచ్చారు. దీంతో  ఈ కేసును ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి పంపించే అవకాశం ఉంది. గత సెప్టెంబర్‌లో పళనిస్వామి ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా అధికార అన్నాడీఎంకేకు చెందిన 18మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని స్పీకర్‌ రద్దుచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం కుదురకపోవడంతో పళనిస్వామి సర్కార్ ఊపిరి పీల్చుకుంది. 

English Title
Palaniswami government gets breather, Madras HC gives split verdict on disqualification of 18 AIADMK MLAs
Related News