ఆదేశాలు తుస్.. కాలుష్యం బుస్

Updated By ManamThu, 11/08/2018 - 23:03
delhi-crackers
  • సమయాలు పాటించని రాజధాని

  • సాయంత్రం 6 నుంచే పండుగ

  • 10 తర్వాతా టపాసుల కాల్పులు

  • విపరీతంగా పెరిగిన కాలుష్యం

  • ఫలితం ఇవ్వని సర్కారు ప్రచారం

delhi-crackersన్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాలను ఎవరూ పాటించలేదు. దీపావళి సందర్భంగా రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని, అవి కూడా శబ్దం, పొగ ఎక్కువ రాని ‘హరిత టపాసులు’ మాత్రమే కాల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించినా.. ఫలితం లేకపోయింది. సాయంత్రం 6 గంటల నుంచే మొదలైన దీపావళి సంబరాలు రాత్రి 10 గంటల తర్వాత కూడా యథేచ్ఛగా కొనసాగాయి. ఫలితంగా కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. ఢిల్లీలో సగటున ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 329గా ఉన్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. అది ‘అత్యంత దారుణం’ అనే కేటగిరీలోకి వస్తుంది. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (సఫర్) సంస్థ కూడా ఢిల్లీ గాలి ‘దారుణం’ అనే పేర్కొంది. సఫర్ అంచనాల ప్రకారం ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఏక్యూఐ రాత్రి 7 గంటలకు 281, 8 గంటలకు 291, 9 గంటలకు 294, 10 గంటలకు 296 చొప్పున ఉన్నట్లు తెలిసింది. ఆనంద్ విహార్, ఐటీఓ, జహంగీర్‌పురీ ప్రాంతాలలో కాలుష్యం అత్యధిక స్థాయిలో ఉంది. అలాగే ఇంకా మయూర్ విహార్ ఎక్స్‌టెన్షన్, లజ్‌పత్‌నగర్, లుట్యెన్స్ ఢిల్లీ, ఐపీ ఎక్స్‌టెన్షన్, ద్వారక, నోయిడా సెక్టార్ 78 తదితర ప్రాంతాలలో కూడా సుప్రీం ఆదేశాలను యథేచ్ఛగా ఉల్లంఘించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. చాలాచోట్ల ఈ ఆదేశాలను ఉల్లంఘించారని వారు అంగీకరించారు. ఢిల్లీతో పాటు ఇరుగుపొరుగు ప్రాంతాలైన నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్ ప్రాంతాల్లో కూడా టపాసులను పెద్ద ఎత్తున కాల్చారు. దాంతో అక్కడ కూడా సుప్రీంకోర్టు నిషేధాన్ని ఉల్లంఘించినట్లయింది. 

ప్రచారంతో ఫలితం నిల్
కేంద్రప్రభుత్వం, ఢిల్లీ సర్కారు కలిసి నవంబరు 1 నుంచి పదో తేదీ వరకు ‘క్లీన్ ఎయిర్ క్యాంపెయిన్’ పేరుతో ప్రచారం నిర్వహిస్తున్నాయి. దాదాపు 52 బందాలను ఢిల్లీ, ఫరీదాబాద్, గురుగ్రామ్, ఘజియాబాద్, నోయిడా ప్రాంతాలలో నియమించి కాలుష్యం వల్ల కలిగే ప్రమాదాల గురించిన ప్రచారం చేశారు. కానీ, ఇదంతా బూడిదలో పోసిన పన్నీరే అయింది. టపాసుల మోతలు చెవులకు చిల్లులు పొడవడంతోపాటు వాయు కాలుష్యం కూడా విపరీతంగా పెరిగి శ్వాసకోశ సమస్యలకు కారణమైంది.

English Title
Orders tus .. pollution buss
Related News