ఒకరి బదులు ఇంకొకరు! 

Updated By ManamSun, 10/14/2018 - 01:46
Makutam

imageసినిమా రంగం చిత్రవిచిత్రాల నిలయం. ఒక పాత్రకు మెుదట ఒకరిని అనుకొని, చివరి నిమిషంలో వారి స్థానంలో మరొకర్ని తీసుకొని సినిమాలు చేసేస్తుంటారు. డేట్ల సమస్యో, విభేదాలు తలెత్తో, పాత్రకు వారు సరిపోరనో.. మెుత్తానికి నటులు మారిపోతుండటం జరుగుతూనే ఉంటుంది. హాలీవుడ్‌లో ఆ విధంగా చివరి నిమిషంలో ఒకరి స్థానంలోకి మరొకరు వచ్చి, ఆ పాత్రను పండించి, ప్రేక్షకుల్ని అలరించి స్టార్లరుున కొంతమందిని చూద్దాం...


మ్యాడ్సెన్ కాదు.. ట్రవోల్టా
‘పల్ప్ ఫిక్షన్’లో హీరో విన్సెంట్ వేగా పాత్రను మైఖేల్ మ్యాడ్సెన్‌ను దృష్టిలో పెట్టుకొనే రాశారు దర్శకుడు క్వెంటిన్ టారింటినో. అరుుతే ‘పల్ప్ ఫిక్షన్’ను కాదని కెవిన్ కోస్ట్‌నర్ సినిమా ‘వ్యాట్ ఈర్ప్’లో నటించేందుకు ఆసక్తి చూపించాడు మ్యాడ్సెన్. దాంతో వేగా పాత్రను జాన్ ట్రవోల్టాతో చేరుుంచారు టారింటినో. అంతే! ఆ పాత్ర పోషణకు గాను బెస్ట్ యూక్టర్‌గా ఆస్కార్ నామినేషన్ సైతం పొందిన ట్రవోల్టా, తర్వాత కాలంలో స్టార్‌గా వెలిగిపోయూడు. మరోవైపు మ్యాడ్సెన్ కెరీర్ ఆశించిన రీతిలో ముందుకు సాగలేదు. స్వయంకృతాపరాధం!

కేజ్ స్థానంలో మిక్కీ
ప్రొఫెషనల్ రెజ్లింగ్ ఇండస్ర్టీ నేపథ్యంలో ‘ద రెజ్లర్’ సినిమాని తియ్యూలనుకున్న డారెన్ అరోనోఫ్‌స్కీ ప్రధాన పాత్ర రాండీ ‘ద ర్యామ్’ రాబిన్సన్ కోసం నికొలస్ కేజ్ వైపు మెుగ్గుచూపారు. నికొలజ్ కూడా ఎంతో ఉద్వేగంతో ఆ పాత్ర చేయడానికి సిద్ధమయ్యాడు. అరుుతే షూటింగ్‌కు వెళ్లడానికి ఆరు వారాల ముందు నికొలస్ సరైన ఫిజిక్ పొందలేదనే ఉద్దేశంతో ఆయన్ని మార్చేసి, తన ఒరిజినల్ చారుుస్ అరుున మిక్కీ రౌర్కేను తీసుకున్నారు. ఆ పాత్రతో బెస్ట్ యూక్టర్ ఆస్కార్ నామినేషన్ పొందాడు మిక్కీ. ఆ తర్వాత నుంచే ఆయన కెరీర్ మంచి ఊపందుకుంది.

image


టౌన్సెండ్ ప్లేస్‌లో మార్టెన్సెన్
పీటర్ జాక్సన్ బ్లాక్‌బస్టర్ సిరీస్ ‘ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్’లో అరగోర్న్ పాత్ర మెుదట చాలా తక్కువమందికి తెలిసిన ఐరిష్ నటుడు స్టువార్ట్ టౌన్సెండ్‌ను వరించింది. కొన్ని నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత, ఇక షూటింగ్ మెుదలవుతుందనంగా, టౌన్సెండ్ మరీ చిన్నవాడిగా కనిపిస్తున్నాడంటూ, అతని స్థానంలో చివరి నిమిషంలో విగ్గో మార్టెన్సెన్‌ను తీసుకున్నారు జాక్సన్. ఎలాంటి ప్రిపరేషన్ లేకుండానే ఎంపికైన మూడు రోజులకే షూటింగ్‌లో పాల్గొని తన అభినయం ఎలాంటిదో చూపించాడు మార్టెన్సెన్. మరోవైపు సినిమాల నుంచి టౌన్సెండ్ దాదాపు రిటైర్ అయ్యూడు.

లాన్స్ స్థానంలో ఆర్నాల్డ్
1984 నాటి తన సైన్స్‌ఫిక్షన్ క్లాసిక్ ‘ద టెర్మినేటర్’లో మనిషిలా కనిపించే సైబోర్గ్ పాత్రకు తన స్నేహితుడు లాన్స్ హెన్రిక్సెన్‌ను తీసుకున్నారు దర్శకుడు జేమ్స్ కామెరాన్. తర్వాత మనసు మార్చుకున్నారు. అప్పటికే కైల్ రీస్ పాత్రకోసం ఆడిషన్ నిర్వహించిన ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్‌ను టెర్మినేటర్ కేరక్టర్‌కు తీసుకున్నారు. అలాగని హెన్రిక్సెన్‌ను సినిమా నుంచి పూర్తిగా తప్పించలేదు. హాల్ వుకోవిక్ అనే పోలీస్ కేరక్టర్‌ను ఆయనతో చేయించారు కామెరాన్. టైటిల్ కేరక్టర్‌ను అద్భుతంగా పోషించిన ఆర్నాల్డ్ కెరీర్ ఎలా దూసుకుపోరుుందో తెలిసిందే.

image


స్కాట్ బదులు జాక్‌మన్
వోల్వరిన్ పాత్రలో హగ్ జాక్‌మన్‌ను కాకుండా మరొకర్ని ఊహించుకోవడం ఇవాళ చాలా కష్టం. కానీ బ్రియూన్ సింగర్ రూపొందించిన బ్లాక్‌బస్టర్ ‘ఎక్స్-మెన్’లో ఆ పాత్రకు మెుదటి చారుుస్ జాక్‌మన్ కాదు, రస్సెల్ క్రోవ్ (‘గ్లాడియేటర్’ ఫేమ్). అరుుతే ఆ ఆఫర్‌ను రస్సెల్ సున్నితంగా తిరస్కరించడంతో, డౌగ్రే స్కాట్‌ను ఎంచుకున్నారు సింగర్. కొన్ని వారాల షూటింగ్ తర్వాత ‘మిషన్ ఇంపాజిబుల్ 2’ సినిమాకి డేట్స్ ఇవ్వాల్సి రావడంతో ‘ఎక్స్-మెన్’ను వదిలేసుకున్నాడు స్కాట్. వెంటనే అప్పటి దాకా అతి తక్కువ మందికే తెలిసిన జాక్‌మన్‌ను వోల్వరిన్ పాత్రకు తీసుకున్నారు సింగర్. ఆ తర్వాత జరిగిందంతా చరిత్ర!

- సంజయ్

English Title
One another instead!
Related News