రామ్ కాంబినేష‌న్‌లో మ‌రోసారి..

Updated By ManamThu, 05/17/2018 - 18:03
raam

thamanఎనర్జిటిక్ స్టార్ రామ్ కథానాయకుడిగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో అనుపమ పరమేశ్వరన్, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ‘తొలిప్రేమ’ లాంటి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో శ్రోతలను అలరించిన సంగీత దర్శకుడు తమన్.. ఈ సినిమాకి కూడా స్వరాలను అందిస్తున్నారు. గతంలో రామ్ హీరోగా నటించిన ‘కందిరీగ’(2011), ‘మసాలా’(2013), ‘పండగ చేస్కో’(2015)లాంటి సినిమాలకి తమన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. హ్యాట్రిక్ సినిమాలతో అలరించిన ఈ ద్వయం మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటారేమో చూడాలి. కాగా.. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

English Title
once again with raam?
Related News