75ఏళ్ల అత్తను నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లిన కోడలు..

Updated By ManamSat, 06/09/2018 - 19:36
Odisha Woman Arrested, Old Mother In Law, Mother-In-Law On Road

Odisha Woman Arrested, Old Mother In Law, Mother-In-Law On Road భువనేశ్వర్ (బర్గాడ్): వయస్సు పైబడిన 75ఏళ్ల అత్త బాగోగులు చూడాల్సిన కోడలే మానవత్వాన్ని మరిచింది. నడవలేని స్థితిలో ఉన్న ముదసలి అత్తను అమానుషంగా నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లి కటకటాల పాలైంది. ఈ ఘటన ఒడిసాలోని బర్గాడ్ జిల్లా తాళపల్లి గ్రామంలో చోటుచేసుకోగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శనివారం వెలుగులోకి వచ్చింది. అత్తను ఇంట్లో నుంచి బలవంతంగా బయటకు కోడలు గెంటివేస్తుండగా ఆమె కాళ్లు పట్టుకొని అత్త ప్రాధేయపడుతున్నట్టు వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో సామాజిక మాథ్యమాల్లో వైరల్‌గా మారడంతో సామాజికవేత్త ఒకరు నిందితురాలు కోడలపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ప్రతిఘటించలేని స్థితిలో ఉన్న వృద్ధురాలిని అత్యంత దారుణంగా చేతులు మెలేసి, జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన కోడలపై హత్యాయత్నం కేసు పెట్టాలని, తల్లిని ఇంతగా హింసిస్తున్నా పట్టించుకోని కుమారుడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఇదంతా అక్కడి ఉండి చోద్యంలా చూస్తున్నా స్థానికులు కనీసం ఆపేందుకు ముందుకు రాకుండా మూగ ప్రేక్షకుల్లా ఉండిపోవడం దురదృష్టకరం. ఈ ఘటనపై వైరల్ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితురాలైన కోడల్ని అరెస్ట్ చేసి ఆమెను కోర్టులో హాజరపర్చారు. భూవివాదం విషయంలో గొడవ జరగడంతో కోడలు ఇలా అత్తను రోడ్డుపైకి ఈడ్చుకెళ్లినట్టు పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు. 

ఇటీవల గుజరాత్‌లో ఓ ప్రొఫెసర్ అనారోగ్యంతో బాధపడుతున్న కన్నతల్లిని మానవత్వం లేకుండా టెర్రస్‌పై నుంచి కిందికి తోసివేసిన ఘటన చోటుచేసుకోగా.. ఇదే నెలలో కోల్‌కతాలో తనకు చెప్పకుండా పూలు కోసిందనే కోపంతో అత్తను కోడలు చితకబాదిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

English Title
Odisha Woman Arrested For Dragging 75-Year-Old Mother-In-Law On Road
Related News