తిత్లీ బాధితులకు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ సాయం

Updated By ManamMon, 10/15/2018 - 11:36
NTR, Kalyan Ram

NTR, Kalyan Ramతిత్లీ తుఫాను ప్రభావంతో ఏపీలోని శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం అయింది. ఈ తుఫాను వలన భారీ ప్రాణ నష్టంతో పాటు వేల కోట్ల ఆస్తి నష్టం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంచనా వేశారు. ఈ క్రమంలో తిత్లీ బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విజయ్ దేవరకొండ, సంపూర్ణేశ్ బాబు, దర్శకులు అనిల్ రావిపూడి తమ సాయాన్ని ఏపీ సీఎం రిలీఫ్‌కు ప్రకటించగా.. తాజాగా నందమూరి అన్నదమ్ములు ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు తమ సాయాన్ని ప్రకటించారు.

తిత్లీ బాధితుల కోసం ఎన్టీఆర్ రూ.15లక్షల సాయం, కల్యాణ్ రామ్ ర.5లక్షల సాయం ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మరోసారి తమ గొప్ప మనసును చాటుకున్నారు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్. కాగా ఇదే ఏడాది కేరళలో వచ్చిన భారీ వరదలు ఆ రాష్ట్రాన్ని కుదిపేయగా.. అప్పుడు కూడా ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు భారీ సాయాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే.

 

English Title
NTR, Kalyan Ram help to Titli victims
Related News