ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎన్టీఆర్ ఎంట్రీ

Updated By ManamThu, 06/14/2018 - 09:02
ntr

ntr అభిమానులకు మరింత దగ్గరగా ఉండేందుకు సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఉపయోగించేందుకు ఆసక్తిని చూపుతుంటారు. ఈ క్రమంలో ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా పలు సామాజిక మాధ్యమాలలో అకౌంట్ క్రియేట్ చేసి వారికి సంబంధించిన వివరాలను అందులో వెల్లడిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను తెరిచాడు. ఈ సందర్భంగా తన తాజా చిత్రం ‘అరవింద సమేత’ ఫస్ట్‌లుక్‌ను షేర్ చేసిన తారక్, వెంటనే దానిని తొలగించాడు. మరోవైపు తారక్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చిన కాసేపటికే లక్షల ఫాలోవర్లు ఆయన ఖాతాలో చేరారు. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తరువాత రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి నటించనున్నాడు ఎన్టీఆర్.
 

English Title
NTR joined in Instrgram




Related News