మొబైల్ స్టోర్ అంబాసిడర్‌గా ఎన్టీఆర్

Updated By ManamThu, 07/12/2018 - 16:15
ntr

NTR యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో కమర్షియల్ యాడ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ‘సెలక్ట్’ అనే పేరుతో రాబోతున్న మొబైల్ స్టోర్‌కు ఎన్టీఆర్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మొబైల్ స్టోర్ మొదటి బ్రాంచ్ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో శుక్రవారం ప్రారంభం కానుండగా.. దానికి ఎన్టీఆర్ ప్రారంభోత్సవం చేయనున్నారు. దీనికి సంబంధించి ఆ మొబైల్ స్టోర్ అధికారిక ప్రకటనను ఇచ్చింది. కాగా టాలీవుడ్ హీరోలైన అల్లు అర్జున్, రామ్ చరణ్‌లు కూడా ‘లాట్’, ‘హ్యాపీ’ అనే మొబైల్ స్టోర్‌లకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

English Title
NTR is ambassador for Celect mobile store
Related News