నా మీద ఇప్పుడు ఎంతో బాధ్యత ఉంది

Updated By ManamFri, 11/09/2018 - 02:48
KHALEEL
  • భారత యువ పేసర్ ఖలీల్

KHALEELలక్నో: ఆసియా కప్‌లో మెరుగైన ప్రదర్శనతో భారత యువ పేసర్ ఖలీల్ అహ్మద్ అందరి దృష్టిని ఆకర్షించాడు. భారత్-విండీస్ మధ్య జరిగిన రెండో టీ20లో ఖలీల్ రెండు కీలక వికెట్లు తీశాడు. విండీస్ ఓపెనర్లు హట్మెయర్, షై హోప్‌కు చుక్కలు చూపించాడు. రెండో టీ20లో క్రీజులో కుదురుకోక ముందే ఓపెనర్లను ఔట్ చేశాడు. అయితే తనకు ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఎంతగానో టీమిండియాలో ఉపయోగపడుతోందని ఖలీల్ అంటున్నాడు. ‘టీమిండియాలో ఆడుతున్న ఆటగాడిగా నామీద ఇప్పుడు ఎంతో బాధ్యత ఉంది. దీన్ని నేను బరువుగా అనుకోవడంలేదు. నాబాధ్యతను నేను ఎంజాయ్‌ను చేస్తున్నాను. టీమిండియాలో ఆడాలనేది నా చిన్ననాటి కల. ఇప్పుడది తీరింది. ఒత్తిడికి లోనయితే నా బాధ్యతను నేను పూర్తి స్థాయిలో నిర్వర్తించలేను. జట్టులో నేను ఉన్నప్పుడు నా బాధ్యతను నిర్వర్తించడంపైనే దృష్టి పెడతాను. ఆటను ఎంజాయ్ చేసినప్పుడే దాన్ని ఇంకాబాగా ఆడాలనే ఆశ కలుగుతుంది. అప్పుడు మెరుగైన ప్రదర్శన చేయగలం. ఇప్పటికయితే ఐపీఎల్‌లో నేను ఆడిన అనుభవం నాకు మేలు చేస్తోంది. టీమిండియాలో డైరెక్ట్‌గా చోటు సంపాదించడం కంటే ఐపీఎల్‌లో ఆడితే ఆటకు సంబంధించి భయం పోతుందనేది నా అభిప్రాయం’ అని ఖలీల్ తెలిపాడు. భారత్-విండీస్‌ల మధ్య మూడో టీ20 ఈనెల 11న జరగనుంది.

Tags
English Title
Now there is a lot of responsibility on me
Related News