రద్దయిన పాస్‌పోర్ట్‌తోనే ఖండాలు దాటేశాడు

Updated By ManamThu, 06/14/2018 - 15:01
Nirav Crosses Borders with Revoked Passport

Nirav Crosses Borders with Revoked Passportన్యూఢిల్లీ: నీరవ్ మోదీ.. పీఎన్బీకి రూ.13 వేల కోట్లు కుచ్చుటోపీ పెట్టి దేశం వదిలి పారిపోయి ముప్పుతిప్పలు పెడుతున్న వైట్ కాలర్ క్రిమినల్. కొన్నాళ్లు హాంకాంగ్‌లో.. కొన్నాళ్లు అమెరికాలో తలదాచుకున్న అతడు.. ఇప్పుడు లండన్‌లో తలదాచుకుంటున్నాడు. అయితే, అంతర్జాతీయంగా ఇమిగ్రేషన్ విధానాలు ఎంత హీనంగా ఉన్నాయో చెప్పే గొప్ప ఉదాహరణ ఇది.

ఎందుకంటే.. నీరవ్ మోదీపై అభియోగాలు రుజువు కాగానే అతడి పాస్‌పోర్ట్‌ను భారత్ రద్దు చేసేసింది. కానీ, ఆ రద్దు చేసిన పాస్‌పోర్ట్‌తోనే ఖండాంతరాలు దాటేశాడు నీరవ్ మోదీ. స్వయానా ఇంటర్‌పోల్ అధికారులు భారత భద్రతా సంస్థలకు అందించిన సమాచారమిది. వాస్తవానికి ఫిబ్రవరి 24నే భారత విదేశాంగ శాఖ నీరవ్ మోదీ పాస్‌పోర్ట్‌ను రద్దు చేసింది. అయితే, మార్చి 15, మార్చి 28, మార్చి 30, మార్చి 31వ తేదీల్లో ఆ రద్దు చేసిన పాస్‌పోర్ట్‌తోనే అమెరికా, హాంకాంగ్, బ్రిటన్ దేశాలకు ప్రయాణం చేసినట్టు భారత భద్రతా సంస్థలకు ఇంటర్‌పోల్ అధికారులు చెప్పారు. ఈ నెల ప్రారంభంలో నీరవ్ మోదీపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఇంటర్‌పోల్‌కు సీబీఐ నివేదించింది. 

English Title
Nirav Crosses Borders with Revoked Passport
Related News